Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా? అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. జనసేన పార్టీని, ఆ పార్లీ అధినేత పవన్ కల్యాణ్‌ను తాము అసలు గుర్తించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. పవన్ కల్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమేని మంత్రి కాకాణి విమర్శించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే మీ పని అని ధ్వజమెత్తారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.