Best Web Hosting Provider In India 2024

విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి మా టార్గెట్ ప్రారంభమవుతుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు ఈ రెండు రోజుల్లోనే కాకుండా తర్వాత కూడా కొనసాగుతాయన్నారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాన్నారు. ఆంధ్ర భోజనం రుచులు చూపించనున్నామని వెల్లడించారు. రాయలసీమ రాగి సంకటి, నాటుకోడి, గుంటూరు గోంగూర పచ్చడి వంటి ఆంధ్రా వంటకాలు మెనూలో ఉండనున్నాయన్నారు. భోజన ఏర్పాట్ల పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అమర్నాథ్ వెల్లడించారు. చంద్రబాబు చేస్తున్న విమర్శలకు హెరిటేజ్ పరిశ్రమ రాష్ట్రంలో లాభదాయకంగా కొనసాగుతూ ఉండటమే సమాధానమని ఆయన అన్నారు. రాష్ట్రౌలో వివిధ రంగాల్లో పారిశ్రామిక, పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించటానికి ప్రయత్నిస్తామని తెలిపారు.