Best Web Hosting Provider In India 2024
Pushpa 2 Update: పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కు విభేదాలు వచ్చాయని.. అందుకే బన్నీ తన పొడవాటి గడ్డాన్ని ట్రిమ్ చేసుకొని విదేశాలకు వెళ్లిపోయాడని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. బన్నీ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు దీనిపై అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాస్ స్పందించాడు.
అలాంటిదేం లేదు: బన్నీ వాస్
పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వెళ్తున్న తరుణంలో డిసెంబర్ లో కూడా మూవీ రావడం లేదని, వచ్చే ఏడాదికి వాయిదా పడిందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీనికి కారణం అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలే అనీ అన్నారు. అయినా ఈ పుకార్లపై పుష్ప 2 టీమ్ నుంచి ఎవరూ స్పందించకపోవడంతో అది నిజమేనేమో అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
అయితే తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాస్ వీటిపై స్పందించాడు. శుక్రవారం (జులై 19) ఆయ్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ పుష్ప 2 షూటింగ్ పైనా అప్డేట్ ఇచ్చాడు. “పుష్ప 2 టీమ్ లో ఏం జరుగుతుందో అల్లు అర్జున్, సుకుమార్, ప్రొడ్యూసర్లకు కాకుండా నాకు మాత్రమే తెలుసు. ఈ పుకార్లు వింటూ ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని మేము చాలా నవ్వుకున్నాం” అని బన్నీ వాస్ అనడం విశేషం.
మరో 15 రోజుల్లో బన్నీ షూటింగ్ పూర్తి
ఇక పుష్ప 2 షూటింగ్ పైనా అప్డేట్ ఇచ్చాడు. “అల్లు అర్జున్ మరో 15, 17 రోజులు షూటింగ్ చేస్తే అతని పార్ట్ పూర్తవుతుంది. క్లైమ్యాక్స్, ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఫహాద్ ఫాజిల్ షూటింగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అంతకుముందు సుకుమార్ గారు ఎడిటింగ్, ఇతర ప్యాచ్ వర్క్ లపై దృష్టి సారించాలని అనుకున్నారు. తర్వాత ఆ పాట, క్లైమ్యాక్స్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. అందుకే అల్లు అర్జున్ ఫ్యామిలీ హాలిడే ప్లాన్ చేశారు. కానీ బయట జనం మాత్రం దీనిని అపార్థం చేసుకొని పుకార్లు వ్యాపింపజేశారు” అని బన్నీ వాస్ అన్నాడు.
“బన్నీకి సుకుమార్ ఓ ఎమోషన్. వాళ్లది ఓ ప్రత్యేక బంధం. సుకుమార్ కోసం బన్నీ ఆరు నెలలైనా వేచి చూస్తాడు. వాళ్లిద్దరూ పరిణతి చెందిన వాళ్లు. పుష్ప బ్రాండ్ ప్రాముఖ్యత వాళ్లకు తెలుసు. ఇద్దరూ వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ ఆగస్ట్ తొలి వారంలో ప్రారంభమవుతుంది” అని బన్నీ వాస్ స్పష్టం చేశాడు. మొత్తానికి అతడు ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
పుష్ప 2 మూవీ నిజానికి ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సి ఉన్నా.. డిసెంబర్ కు వాయిదా పడిన విషయం తెలిసిందే. మరి సమయానికి షూటింగ్ పూర్తి చేసి వాళ్లు చెప్పిన రిలీజ్ డేట్ నే మూవీని తీసుకొస్తారా లేదా చూడాలి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits