చందర్లపాడు గ్రామం “జల జీవన్ మిషన్” పనులను ప్రారంభించిన డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..


ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది‌.06-8-2022(శనివారం) ..

చందర్లపాడు గ్రామం “జల జీవన్ మిషన్” పనులను ప్రారంభించిన డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం ..

చందర్లపాడు గ్రామం లోని ఎస్.సి కాలనీలో రూ.33 లక్షల అంచనా విలువ “జల జీవన మిషన్” ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శంకుస్థాపన నిర్వహించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని , అందులో భాగంగానే వాటర్ లైన్ ల ఏర్పాటు , డ్రైనేజీల నిర్మాణం , రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు – ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం – రైతు భరోసా కేంద్రం – విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు , అదేవిధంగా జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రూ.33 లక్షల అంచనా విలువతో వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన నిర్వహించామని , త్వరలోనే గ్రామంలో ప్రతి ఇంటికి తాగు నీటి కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ,

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల ఏసమ్మ , జెడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు , సర్పంచ్ కస్తాల పున్నమ్మ , ఎంపీటీసీ సభ్యులు , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , పార్టీ మండల అధ్యక్షులు కందుల నాగేశ్వరరావు , యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, రాయల జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *