Best Web Hosting Provider In India 2024

Telangana Govt Employees Transfers : ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో జులై 5వ తేదీ నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ గడువు జులై 20వ తేదీతో ముగిసింది. అయితే పలు శాఖల్లో బదిలీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది.
పలు విభాగాల్లో ఆగిన ప్రక్రియ…!
సాధారణ బదిలీల్లో కొన్ని ఉద్యోగ సంఘాలపై పలువురు ఉద్యోగులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ పలు విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా పలు శాఖల్లో ఈ ప్రక్రియ నిర్ణయించిన గడువులోపు పూర్తి కాలేదు. విద్యా, వైదారోగ్య శాఖతో పాటు పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలోనే సర్కార్ గడువు పొడిగించినట్లు తెలిసింది. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని సర్కార్ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 80న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లు పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.రెండేళ్లు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని పేర్కొంది.
ఒకే క్యాడర్ నలభై శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయకూడదని సర్కార్ నిర్ణయించింది. స్పౌజ్, వితంతువు, ఏడాది లోపు రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, న్యూరో సర్జరీతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ అంతా కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతోంది. దీని నుంచే ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల అప్లికేషన్లు, వివరాలను పరిశీలించి…. బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కానీ పలు విభాగాల్లో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవటంతో జులై 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది.
ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో శనివారం పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గిరిజన సంక్షేశాఖ కార్యదర్శి బాధ్యతలను ఏ శరత్‌కు అప్పగించింది ప్రభుత్వం. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) స్పెషల్ సెక్రెటరీగా ఎస్ హరీశ్‌ను, మేడ్చల్ మల్కాజ్‌గిరి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా రాధికా గుప్తాను నియమించింది. రవాణా, గృహనిర్మాణం, జీఏడీ ప్రత్యే కార్యదర్శి వికాస్ రాజ్‌నియమించగా… జీఏడీ ముఖ్య కార్యదర్శి బెనహర్ మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను ఇచ్చారు.
టాపిక్