ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.06-8-2022 [శనివారం] ..
నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులపై కలెక్టర్ ఢిల్లీరావు గారితో కలసి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు- స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలి ..
నందిగామ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ భవనాల నిర్మాణాల ప్రగతి పై శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు మరియు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ,
ఈ సమావేశంలో నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ కేర్ సెంటర్లు తదితర అభివృద్ధి పనుల ప్రగతి గురించి అధికారులతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న పనులు, ఇంకనూ ప్రారంభించవలసిన పనుల గురించి మరియు ప్రభుత్వ భవనాలు నిర్మాణ దశలో క్షేత్రాస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారికి వివరించడం జరిగింది , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాలు -ఆలోచనలకు అనుగుణంగా అధికారులు -స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో పని చేస్తూ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు ,
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధికారులు – ఎంపీపీలు- జెడ్పీటీసీలు – సర్పంచులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..