మ‌ద్ద‌తు తెలిపిన అంద‌రికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై ఫోటో గ్యాలరీ 

న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై వైయ‌స్ఆర్‌సీపీ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసింది.  న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమం అనంతరం పార్టీ శ్రేణులు, మీడియాను ఉద్ధేశించి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడారు.   
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి అక్కచెల్లెమ్మకు మనస్ఫూర్తిగా ఒకవైపు కృతజ్ఞతలు. మరోవైపున ఇక్కడికి రాలేకపోయినా సంఘీభావం తెలిపిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలకు, అన్మదమ్ములకు,  అవ్వాతాతలందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈరోజు ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవాలు తెలుసుకోవడంతో పాటు, జరిగిన వాస్తవాల మీద వాళ్ల అభిప్రాయాలు తెలియజేస్తూ మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి, వాళ్ల నాయకులకు  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అదే విధంగా ప్రతి మీడియా హౌస్‌ నుంచి వచ్చిన ప్రతి జర్నలిస్టు… ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకున్నారు కాబట్టి.. వాళ్లు కూడా ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న హేయమైన పనుల మీద గళం విప్పాలని విన్నవించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Best Web Hosting Provider In India 2024