Yevam OTT Release Date: ఓటీటీలోకి వస్తున్న చాందీనీ చౌదరి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Yevam OTT Release Date: షార్ట్ ఫిల్మ్స్ తో పేరు తెచ్చుకొని, కలర్ ఫొటో మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ చాందినీ చౌదరి నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ యేవమ్. ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తాజాగా ఆహా ఓటీటీ రివీల్ చేసింది.

యేవమ్ ఓటీటీ రిలీజ్ డేట్

చాందినీ చౌదరి నటించిన యేవమ్ మూవీ గత నెల 14న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ యేవమ్ మూవీ జులై 25, మధ్యాహ్నం 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా సదరు ఓటీటీ తెలిపింది.

“నేరస్థుడు ఎవరైనా తప్పించుకోలేరు.. ఇన్‌స్పెక్టర్ సౌమ్య జులై 25న ఛార్జ్ తీసుకుంటోంది” అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ యేవమ్ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని తెలిపింది. ఈ సినిమాలో చాందినీ చౌదరితోపాటు వశిష్ట సింహా, జైభారత్‌, బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి ఆషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు కూడా నటించారు. ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహించాడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు.

ఒకే రోజు రెండు సినిమాలు

చాందినీ చౌదరి నటించిన రెండు సినిమాలు గత నెలలో ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ కావడం విశేషం. ఈ యేవమ్ మూవీతోపాటు మ్యూజిక్ షాప్ మూర్తి అనే మరో సినిమా కూడా జూన్ 14న రిలీజయ్యాయి. ఇప్పటికే మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

ఇక ఇప్పుడీ యేవమ్ మూవీ కూడా ఓటీటీలోకి రాబోతోంది. తెలుగులో ప్రేమ ఇష్క్ కాద‌ల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది చౌంద‌ని చౌద‌రి. మ‌ను, క‌ల‌ర్ ఫొటో, స‌మ్మ‌త‌మే తో పాటు ప‌లు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. క‌ల‌ర్ ఫొటో మూవీ నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం, నితిన్ లైతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ మూవీస్ లలో కీలక పాత్రలు చేసింది.

ఇటీవ‌ల రిలీజైన విశ్వ‌క్‌సేన్ గామిలో హీరోయిన్ గా కనిపించింది. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాన్ని సాధించింది. స‌బా నాయ‌గ‌న్ మూవీతో గ‌త ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం సంతాన ప్రాప్తిర‌స్తు పేరుతో ఓ మూవీ చేస్తోంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024