Ram Charan Chiranjeevi: లండన్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, చిరంజీవి.. మెగాస్టార్ షేర్ చేసిన ఫొటో వైరల్

Best Web Hosting Provider In India 2024

Ram Charan Chiranjeevi: మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేములో కనిపిస్తే మెగా ఫ్యాన్స్ కు పండగే కదా. అలాంటిదే ఈ ఫొటో కూడా. ఇప్పుడీ స్టార్ తండ్రీకొడుకులు లండన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోను చిరంజీవే తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది. ఇందులో స్టార్ హీరోలతోపాటు బుజ్జి క్లిన్‌కారా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

లండన్‌లో మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం లండన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు అటు నుంచి అటే వాళ్లు శుక్రవారం (జులై 26) జరగబోయే ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి కూడా వెళ్లనుండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే వెల్లడించాడు. తమ ఫ్యామిలీ ట్రిప్ ఫొటోను షేర్ చేస్తూ.. తాము లండన్ నుంచి రేపు (జులై 25) పారిస్ వెళ్తున్నట్లు చెప్పాడు.

“లండన్ లోని హైడ్ పార్క్ లో ఫ్యామిలీతోపాటు మా చిన్నారి క్లిన్‌కారాతో ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం. రేపు పారిస్ వెళ్లబోతున్నాం. సమ్మర్ ఒలింపిక్స్ ఇనాగరల్ ఈవెంట్ పిలుస్తోంది” అనే క్యాప్షన్ తో చిరంజీవి ఈ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ లతోపాటు చిరు భార్య సురేఖ, చరణ్ భార్య ఉపాసన, వాళ్ల కూతురు క్లిన్ కారా కూడా ఉన్నారు.

ఇంద్ర రీరిలీజ్

మెగాస్టార్ చిరంజీవి వచ్చే నెల 22న తన పుట్టిన రోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతని ఇండస్ట్రీ హిట్ ఇంద్ర మూవీ రీరిలీజ్ కాబోతోంది. చిరు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వెల్లడించింది. దీంతో ఇప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు.

22 ఏళ్ల కిందట అంటే 2002లో వచ్చిన ఇంద్ర మూవీలో ఇంద్రసేనా రెడ్డి పాత్రలో చిరంజీవి నట విశ్వరూపం చూపించాడు. ఆ సినిమా అప్పట్లో అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అలాంటి మూవీ ఇన్నాళ్లకు మళ్లీ థియేటర్లలోకి రానుండటంతో చిరు ఫ్యాన్స్ ఆనందంలో ఉప్పొంగిపోతున్నారు.

ఇక చిరంజీవి రాబోయే సినిమాల గురించి చూస్తే.. ప్రస్తుతం అతడు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో మరో రెండు, మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే అతడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16లోనూ అతడు నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చరణ్, చిరంజీవి కలిసి చివరిగా రెండేళ్ల కిందట ఆచార్య మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. తర్వాత చిరు నటించిన మూడు సినిమాలు రిలీజైనా.. చరణ్ సినిమా ఒక్కటి కూడా రాలేదు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024