Best Web Hosting Provider In India 2024
Hardik Pandya Ananya Dating: హార్దిక్ పాండ్యా కొన్ని నెలలుగా ఎక్కువగా నెగటివ్ విషయాలతోనే వార్తల్లో ఉంటున్నాడు. మొదట ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం, తర్వాత భార్యతో విడాకులు, ఇండియన్ టీ20 కెప్టెన్సీ దక్కకపోవడం.. ఇక తాజాగా బాలీవుడ్ నటి అనన్య పాండేతో డేటింగ్ అంటూ పుకార్లు. విడాకుల విషయం ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే డేటింగ్ చేస్తున్నాడంటూ హార్దిక్ పై వస్తున్న వార్తలపై అనన్య ఫ్రెండ్ స్పందించారు.
హార్దిక్, అనన్య డేటింగ్?
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడిపోయినట్లు ఈ మధ్యే చెప్పిన విషయం తెలుసు కదా. అయితే ఆ వెంటనే అతడు కొత్త భార్య వేటలో పడినట్లు వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. అది కూడా అతడు మరో బాలీవుడ్ నటి, లైగర్ మూవీ బ్యూటీ అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు మరింత ఆసక్తి రేపాయి.
ఈ మధ్యే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ఈ ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవవడంతో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై తాజాగా అనన్య క్లోజ్ ఫ్రెండ్ ఒకరు స్పందించారు. ఈ వార్తల్లో అసలు నిజం లేదని అన్నారు. “హార్దిక్, అనన్య ఇద్దరూ అంబానీ వెడ్డింగ్ లో కలిసిన మాట నిజమే. ఇద్దరి వైబ్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయి. కానీ అనన్య స్వభావం అలాంటిదే. ఆమె ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరితోనూ కలిసిపోతుంది. అదొక హ్యాపీ మూమెంట్.. ప్రతి ఒక్కరూ హ్యాపీగా కనిపించారు” అని చెప్పడం విశేషం.
అనన్య ప్రస్తుతం తన పని మీదే దృష్టి సారించిందని కూడా ఆమె ఫ్రెండ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉందని, తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని చెప్పారు. హార్దిక్, అనన్య డేటింగ్ వార్తలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
హార్దిక్, అనన్య డేటింగ్ వార్తలకు కారణమిదీ
హార్దిక్, అనన్య డేటింగ్ అనగానే అభిమానులు పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ మధ్యే తన భార్యతో విడిపోయి, కెరీర్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ కు ఓ తోడు అవసరం అని వాళ్లు భావిస్తున్నారు. దీంతో సహజంగానే అతడు మరొక పార్ట్నర్ కోసం చూస్తున్నాడని అనుకున్నారు. అంబానీ వెడ్డింగ్ లోని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హార్దిక్, అనన్య డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బయటకు రావడం విశేషం. ఆ వెంటనే ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లోనూ ఒకరినొకరు ఫాలో అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న చర్చ మొదలైంది. కానీ వాటిలో నిజం లేదని అనన్య ఫ్రెండ్ కామెంట్స్ తో తేలిపోయింది.