
Best Web Hosting Provider In India 2024

Tirupati Triple Murders: తిరుపతిలో దారుణ హత్యలు జరిగాయి. అన్న మీద కోపంతో ఓ తమ్ము డు కిరాతకంగా ప్రవర్తించాడు. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కత్తితో నరికిహత్య చేశాడు. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డాడు.
చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుడిమెట్ల మోహన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బుధ వారం రాత్రి తిరుపతి పద్మావతినగర్‌లో ఈ హత్యలు జరిగాయి. నెల్లూ రుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్ రెండేళ్ల క్రితం కుటుం బంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్ లో నివాసం ఉం టున్నాడు. దాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తిరిపి దాస్ తమ్ముడు గుడిమెట్ల మోహన్ (36) చెన్నైలో పనిచేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో ఉన్న మోహన్‌కు అన్నావదినలు 2019లో పెళ్లి చేశారు. పెళ్లై ఓ కుమార్తె పుట్టిన తర్వాత మోహన్‌కు అతని భార్యకు మధ్య గొడవలు జరగడంతో 2021లో అతని భార్య పుట్టింటికి వెళ్లి పోయింది.
ఆ తరువాత తిరిపి దాస్… తమ్ముడు మోహన్ భార్య, ఆమె తల్లిదం డ్రులతో మాట్లాడి ఇద్దరూ కలిసి కాపురం చేసుకునేలా రాజీ కుదిర్చాడు. రాజీ చర్చల సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేసి మనశ్సాంతి లేకుండా చేశావంటూ అన్నపై తమ్ముడు మోహన్ దాడి చేశాడు. భార్య పుట్టింటికి వచ్చిన కొంతకాలానికి భార్యతో మళ్లీ గొడవలు ప్రారంభం కావటంతో ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి ఉండేవాడు.
రెండు రోజుల క్రితం చెన్నై నుంచి తిరుపతి వచ్చిన మోహన్ బుధవారం సాయంత్రం అన్న కూతుళ్లను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. వారిని ఇంట్లో దించిన తర్వాత బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్న ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి కత్తితో వదినపై దాడి చేశాడు. తొలుత తిరిపి దాస్ భార్య సునీతపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. సునీతపై దాడి చేస్తున్న సమయంలో ఇంటి లోపల నుంచి తలుపులు గడియపెట్టాడు. గొడవ సమాచారం తిరిపి దాస్‌కు తెలిసి ఇంటికి చేరుకునే సరికి ముగ్గురిని హతమార్చి మోహన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
ఈ ఘటనలో దాస్ భార్య సునీత(35), కుమార్తెలు దేవిశ్రీ(13), నీరజ(11) హత్యకు గురయ్యారు. నిందితుడు మోహన్ హత్యల తర్వాత అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో గొడవ సమాచారం తెలిసి తిరిపిదాస్ ఇంటికి వచ్చేసరికి నాలుగు ప్రాణాలు పోయాయి.
పెళ్లై ఓ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం, అన్న కుటుంబం సంతోషంగా ఉండటంతో వారిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల తాను విడిపోవావాల్సి వచ్చిందని నిందితుడు తరచూ అన్నతో గొడవ పడే వాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. రక్తపు మడుగులో పడిఉన్న భార్యా పిల్లల్ని చూసి తిరిపిదాస్ గుండెలు బాదుకున్నాడు. ఈ ఘటనపై తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టాపిక్