Diabetes: డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని 60 శాతం వరకు తగ్గించుకోవాలా? అయితే ప్రతిరోజూ వీటిని తినండి

Best Web Hosting Provider In India 2024

Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాతే కనిపించేది. కానీ ఇప్పుడు 30 ఏళ్ల వయసులో కూడా దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డయాబెటిస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కొత్త అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 60 శాతం వరకు తగ్గుతుందని తేలింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు BMC న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్ లో ప్రచురించారు.

ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి?

డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష, ఎండు ఆప్రికాట్లు, ప్రూనే వంటి డ్రైఫ్రూట్స్ ను ప్రతిరోజూ తినాలి. ఇవి ఒకసారి కొనుక్కుంటే నెలల పాటు నిల్వ ఉంటాయి. ఇవి పాడయ్యేవి కూడా కాదు, కాబట్టి వీటిని ఒకసారి కొని ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో పోషకాలు నిండుగా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముందుంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఫైబర్‌తో పాటు డ్రై ఫ్రూట్లలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని కాపాడతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది.

చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అందులో ఉండే సహజశక్తి శరీరంలో చేరుతుందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుందని అంటారు. దీనివల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని అనుకుంటారు, కానీ ఈ అధ్యయనం మాత్రం ఆ విషయాన్ని తప్పని నిరూపిస్తోంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు అని అంటుంది.

యూకేలోని బయో బ్యాంకు నుంచి దాదాపు 5 లక్షల మంది ఆరోగ్య డేటాను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. వారి అలవాట్లు, డ్రైఫ్రూట్స్ వినియోగంపై కూడా అధ్యయనం నిర్వహించారు. ఎవరైతే ప్రతిరోజూ ఒక ప్రూనే, కొన్ని ఎండు ద్రాక్షలు, ఆప్రికాట్లు తింటారో… వారు ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్టు నిర్ధారించారు.

ఈ అధ్యయనం తర్వాత డ్రై ఫ్రూట్స్, పోషకాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధ్యయనకర్తలు తాజా పండ్లలాగే డ్రై ఫ్రూట్స్ లో కూడా ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువని ఈ అధ్యయనకర్తలు చెబుతున్నారు. తాజా పండ్లు ఎలా అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయో… డ్రై ఫ్రూట్స్ కూడా అలాగే ఉంచుతాయని అంటున్నారు పరిశోధకులు. తాజా పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్య భాగం. ఇవి శరీరానికి హైడ్రేషన్‌ను అందించడంతోపాటు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రక్తం లో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని అంటున్నారు అధ్యయనకర్తలు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం వీటిలో కూడా ఉందని, కాబట్టి వీటిని సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధన చెబుతోంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024