Best Web Hosting Provider In India 2024
OTT Movie: స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఆ జానర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. దేవర బ్యూటీ జాన్వీ కపూర్ ఓ క్రికెటర్ గా నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా శుక్రవారం (జులై 26) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మిస్టర్ అండ్ మిసెస్ మహి ఓటీటీ స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ నటించిన మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి. గత మే నెలలో థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో శుక్రవారం (జులై 26) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
క్రికెట్ చూడటమే కాదు ఆడటం అంటే కూడా ఇష్టపడే ఓ జంట చుట్టూ తిరిగే కథే ఈ మిస్టర్ అండ్ మిసెస్ మహి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ వృత్తిపరంగా డాక్టరే అయినా.. క్రికెట్ ఆడటాన్ని ఇష్టపడుతుంది. అటు ఆమె భర్తగా నటించిన రాజ్ కుమార్ రావ్ ఓ విజయవంతమైన స్పోర్ట్స్ పర్సన్ కావాలని కలలు కంటుంటాడు. తాను ఆ దిశగా అడుగులు వేస్తూనే తన భార్య క్రికెటర్ అయ్యేలా ఆమెకు శిక్షణ ఇస్తుంటాడు.
అయితే ఈ జంటకు అది అంత సులువు కాదు. ఈ క్రమంలో ఇద్దరూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. వాటిని ఆ జంట అధిగమించిందా? తమ కలలను సాకారం చేసుకుందా అన్నదే ఈ సినిమా కథ. థియేటర్లలో ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. రెండు నెలల కిందట సినిమా లవర్స్ డే రోజే ఈ మూవీ రిలీజైంది. దీంతో దేశవ్యాప్తంగా ఆరోజు మల్టీప్లెక్స్ టికెట్లను రూ.99కే అమ్మారు. ఇది మూవీ మంచి ఓపెనింగ్స్ సాధించడానికి ఉపయోగపడింది.
జాన్వీ బిజీ బిజీ
జాన్వీ కపూర్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్ కాబోతోంది. ఇందులో ఆమె ఇండియా యంగెస్ట్ డిప్యూటీ హైకమిషనర్ పాత్రలో నటించడం విశేషం. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆసక్తి రేపేలా ఉంది.
మరోవైపు రాజ్ కుమార్ రావ్ కూడా తన నెక్ట్స్ మూవీ స్త్రీ2 ప్రమోషన్లు చేస్తున్నాడు. 2018లో వచ్చిన స్త్రీ మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. స్త్రీ2లో రాజ్ కుమార్ రావ్ తోపాటు శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ, అపరశక్తి ఖురానా నటిస్తున్నారు. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.