OTT: ఓటీటీలోకి వచ్చేసిన గెటప్ శ్రీను మూవీ.. మలయాళం, తమిళ సినిమాల లాంటి సీన్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Raju Yadav OTT Release: జబర్తస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన నటనతో, కామెడీతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు గెటప్ శ్రీను. విభిన్న గెటప్స్ వేస్తూ నవ్విస్తూ బుల్లితెర కమల్ హాసన్ అని అందరూ కొనియాడేలా చేసుకున్నా గెటప్ శ్రీను హీరోగా చేసిన తొలి సినిమా రాజు యాదవ్.

నవ్వుతూనే ఉండే లోపం

సినిమాల్లోనూ కమెడియన్‌గా సత్తా చాటుతూనే హీరోగా గెటప్ శ్రీను వేసిన మరో కొత్త అడుగే రాజు యాదవ్ మూవీ. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన రాజు యాదవ్ సినిమా మే 17న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది ఈ చిత్రం.

చాలా రియలిస్టిక్‌గా

తమిళం, మలయాళం సినిమాలలో కనిపించేటువంటి సహజత్వంతో కూడుకున్న సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్లకుండా చాలా రియలిస్టిక్‌గా రాజు యాదవ్ సినిమాను తీర్చిదిద్దారు మూవీ డైరెక్టర్ కృష్ణమాచారి. టేకింగ్ ఎలా ఉన్నా యూనిక్ స్టోరీతో గెటప్ శ్రీను హైలెట్ యాక్టింగ్‌తో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఆహా ఓటీటీలో

అయితే, థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది రాజు యాదవ్ మూవీ. రాజు యాదవ్ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో జూలై 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఆహా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది రాజు యాదవ్ సినిమా.

దేవదాసులుగా మారిపోవడం

రాజు యాదవ్ సినిమా కథలోకి వెళితే.. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

క్రికెట్ బాల్ తగిలాక

అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా రూపొందించిన చిత్రమే రాజు యాదవ్. ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది.

తండ్రి కొడుకుల మధ్య

ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్‌కి వెళ్లి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్‌లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్‌తో కంటతడి పెట్టిస్తుంది.

గెటప్ శ్రీను నటన హైలెట్

గెటప్ శ్రీను నటన ఈ చిత్రానికి ప్రధానబలం. ఫేస్ మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ప్రథమార్థంలో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన, ద్వితీయార్థంలో నవ్వుతూనే భావోద్వేగాలని పండించాడు. దర్శకుడు కృష్ణమాచారి ఒక రియల్ స్టోరీని తీసుకొని, అంతే రియలిస్టిక్‌గా చూపించాడు. సినిమాలో చివరి 20 నిమిషాలు వచ్చే సన్నివేశాల్ని, ఎమోషన్‌ని మలిచిన తిరుకి దర్శకుడికి ప్రశంసలు వచ్చాయి.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024