Best Web Hosting Provider In India 2024
Telangana Degree Admissions 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే తాజాగా స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ అవకాశాన్ని మిగిలిన విద్యార్థులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
నేటి నుంచే రిజిస్ట్రేషన్లు…
స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఇవాళ్టి (జులై 25వ తేదీ) నుంచే ప్రారంభమైంది. అర్హత కలిగిన విద్యార్థులు నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు ఆగస్టు 2వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఇందుకు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యేక విడత కౌన్సెలింగ్ లో భాగంగా జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఆగస్టు 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు విధించారు. ఆన్‌లైన్ ద్వారా రిపోర్టింగ్ చేసిన వారు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకు నేరుగా కాలేజీలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
TS DOST Registration 2024 -రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే….
- డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.
- ఇందులో Candidate Pre-Registrationపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ముందుగా Application Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి.
- Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మూడు విడతలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని మిగిలిన విద్యార్థులు సీట్లు పొందవచ్చు.
లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల:
తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఇందులో భాగంగా బుధవారం నోటిఫికేషన్ ను ఖరారు చేయగా… ఆగస్టు 5వ తేదీ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 20వ తేదీతో ముగియనుంది. రిజిస్ట్రేషన్ల కోసం రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 28 నుంచి 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి.
ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
టాపిక్