Best Web Hosting Provider In India 2024

OTT Bold Movie: ఒకప్పుడు తెలుగులో ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో నటించిన తాప్సీ పన్ను రెచ్చిపోయి లిప్ లాక్ సీన్లలో నటించిన బోల్డ్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. మూడేళ్ల కిందట వచ్చిన సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ ట్రైలర్ ను గురువారం (జులై 25) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.
తాప్సీ బోల్డ్ మూవీ
తాప్సీ పన్ను, విక్రాంత్ మస్సీ నటించిన మూవీ హసీన్ దిల్‌రుబా. మూడేళ్ల కిందట నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైందీ మూవీ. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తొలిసారి తాప్సీ హాట్ హాట్ సీన్లలో నటించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. దీనిపేరు ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా. ఈ సీక్వెల్ లో తన హాట్ నెస్ డోసు పెంచుతూ మరింత రెచ్చిపోయి లిప్ లాక్ సీన్లలో నటించిందామె.
తాజాగా గురువారం (జులై 25) రిలీజైన ట్రైలర్ చూస్తుంటే.. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మరింత థ్రిల్ పంచేలా కనిపిస్తోంది. మూడేళ్ల కిందట వచ్చిన ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో సరిగ్గా అక్కడి నుంచే ఈ సెకండ్ పార్ట్ ట్రైలర్ మొదలుపెట్టారు. కనిపించకుండా పోయిన తన భర్త (రిషూ) ఎక్కడ అంటూ ఓ పోలీస్ అధికారి రాణి (తాప్సీ)ని అడగటంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
అయితే ఈ సీక్వెల్ లో తాప్సీకి ఓ కొత్త లవర్ పరిచయం అవుతాడు. మొదటి పార్ట్ లో తన ఇంటికి వచ్చిన తన భర్త కజిన్ ప్రేమలో పడి అతన్నే చంపడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు ఎదుర్కొన్న రాణి.. రెండో భాగంలోనూ మళ్లీ అలాంటి తప్పే చేసిందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇప్పటికీ తాను తన భార్య చెప్పినట్లే వింటాను కానీ.. ఆమె మళ్లీ అలాంటి పని చేయకూడదని రిషూ చెప్పే డైలాగు కూడా ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా ఓటీటీ రిలీజ్
హసీన్ దిల్‌రుబా మూవీ అక్టోబర్, 2021లో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఇప్పుడీ సీక్వెల్ కూడా అదే ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీని ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది.
కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తోంది. వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రేపే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తో ఈ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits