Devara Villain: దేవరకు ఒక్కరు కాదు ఇద్దరు విలన్లు.. సెట్స్‌లో చేరనున్న మరో బాలీవుడ్ నటుడు

Best Web Hosting Provider In India 2024

Devara Villain: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ సినిమాలో అతడు ఒక్కడే కాదు మరో విలన్ కూడా ఉన్నాడు. అతడు కూడా బాలీవుడ్ నుంచే కావడం విశేషం. యానిమల్ మూవీలో విలన్ గా మెప్పించిన బాబీ డియోల్ కూడా ఈ దేవర సెట్స్ లో చేరనున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తో మూవీ వర్గాలు తెలిపాయి.

దేవరలో మరో విలన్

దేవర మూవీ సరిగ్గా మరో రెండు నెలల్లో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ షూటింగ్ కూడా చివర్లో ఉంది. అయితే ఇలాంటి సమయంలో మూవీలో మరో విలన్ కూడా ఉండనున్నట్లు తేలడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ తోపాటు మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ సినిమా విలన్ గా చేస్తున్నాడట.

“అవును, బాబీ డియోల్ తోనూ టీమ్ సంప్రదిస్తోంది. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలో బాబీ కూడా విలన్ గా నటించనున్నాడు. దేవర పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ గా ఉంటాడు. దేవర పార్ట్ 1 చివర్లో బాబీ డియోల్ ఎంట్రీ ఇస్తాడు. దేవర పార్ట్ 2లో మాత్రం సైఫ్, బాబీ ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది”అని ఈ సినిమా వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ తో చెప్పాయి.

బాలీవుడ్ హంగామా

దేవర మూవీలో బాలీవుడ్ నటుల హవా నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రధాన విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు. ఇప్పుడు మూడో బాలీవుడ్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజంగా ఆసక్తికరమే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ దేవర మూవీతోనే జాన్వీ తెలుగులోకి అడుగుపెడుతోంది.

ఆమె తల్లి శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన విషయం తెలిసిందే. అలాంటి జాన్వీ మాత్రం బాలీవుడ్ లో నిలదొక్కుకున్నాక టాలీవుడ్ వైపు వస్తోంది. ఈ దేవరతోపాటు రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఆర్సీ16లోనూ నటించనుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం తన కల అని, తన జీవితంలో అతనితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఓ సంతోషకరమైన విషయం అని జాన్వీ చెప్పడం విశేషం.

దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట రిలీజైన విషయం తెలిసిందే. రెండో సాంగ్ కూడా రాబోతోంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తోపాటు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకోలాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న తొలి సినిమా ఇదే.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024