Best Web Hosting Provider In India 2024

Radhika Merchant look: అనంత అంబానీతో కలిసి ఏడు అడుగులు నడిచింది రాధిక మర్చంట్. తన పెళ్లి వేడుకలో ఆమె ధరించిన ప్రతి డ్రెస్ కూడా ఎందరినో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె హెల్దీ వేడుక కోసం మల్లెపూల దుపట్టాను వేసుకుంది. అది ఎంతో మంది నచ్చింది. ఢిల్లీకి చెందిన ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ మాత్రం ఆ దుప్పట్టాను అచ్చు గుద్దినట్టు తయారు చేసింది. అది కూడా కేవలం 2000 రూపాయల్లోనే. ఆమె రాధిక లుక్‌ను రీక్రియేట్ చేసింది. రాధిక లాగే పసుపు లేహంగాతో మల్లెపూల దుపట్టాను వేసుకుంది. దీన్ని తయారు చేయడానికి ఆమెకు చాలా తక్కువ డబ్బులే ఖర్చయ్యాయి.
పన్నెండు గంటల పాటూ
ఢిల్లీ ఇన్ఫ్లూయెన్సర్ అరుషి పహ్వా. ఈమె ఫ్యాషన్ ఫ్రీక్. ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాషన్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. రాధిక మర్చంట్ హల్దీ వేడుకలో వేసుకున్న అద్భుతమైన ఫ్లవర్ దుపట్టా ఆమెకి ఎంతో బాగా నచ్చేసింది. ఆమె స్వయంగా ఇంటి దగ్గర కూర్చుని ఈ దుపట్టాను తయారు చేసింది. మల్లెపూలు, బంతిపూలు, సూది, దారం ఇవే దానికి వాడిన వస్తువులు. ఇక ఖర్చు విషయానికి వస్తే 2,000 రూపాయల లోపు అయినట్టు ఆ ఇన్ఫూ ఫ్లుయెన్సర్ చెబుతోంది. తయారు చేయడానికి మాత్రం 12 గంటల సమయం పట్టిందని చెప్పింది. దాని తాలూకు వివరాలను కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది.
ఈ దుపట్టాను తయారు చేయడానికి ముందు ఆమె చాందిని చౌక్, మోతీ నగర్ వంటి ఢిల్లీలోని అనేక దుకాణాలకు తిరిగింది. అక్కడ ఆమెకు ఇలాంటి దుపట్టాలు ఏవి కూడా 15000 రూపాయల లోపు రాలేదు. దీంతో స్వయంగా తానే తయారు చేయాలని నిర్ణయించుకుంది. పూలను కొనుక్కుంది. వాటిని జిగ్ జాగ్ నమూనాలో కుట్టుకుంటూ చివరికి దుపట్టాను రెడీ చేసింది. దుపట్టా అంచుల్లో బంతి పువ్వులను కుట్టింది.
ఇక స్లీవ్ లెస్ బ్లౌజు, మ్యాచింగ్ టల్లే లెహంగా కూడా రెడీ చేసుకుంది. వాటిని ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఆమె రాధిక మర్చంట్ లుక్కును రిక్రియేషన్ చేసింది. రాధికాలాగే తెల్లటి పూల చెవి పోగులను, నెక్లెస్ ను ధరించింది
ఆమె రాధిక మర్చంట్ లుక్‌ను రిక్రియేట్ చేసినట్టు ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టగానే ఎంతోమంది ఆమెను మెచ్చుకుంటూ మెసేజ్ లు పెట్టారు. ఇది ఒక కళ అని, అది అందరికీ సాధ్యం కాదని మెచ్చుకున్నారు. కానీ కేవలం రాధిక మర్చంట్ పూల దుపట్టాను రెండు వేల రూపాయల్లో ఈమె తయారు చేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే రాధిక మర్చంట్‌కు ఆ దుప్పట్టాను తయారుచేసిన ఫ్యాషన్ డిజైనర్లు మాత్రం లక్షల్లో సంపాదించినట్టు తెలుస్తోంది.
రాధిక మర్చంట్ అనంత్ అంబానీ వేడుకగా జరిగింది. దాదాపు పెళ్లికి ఆరు, ఏడు నెలల ముందు నుంచే వారి హంగామా మొదలైపోయింది. ఇప్పుడు పెళ్లి పూర్తయినా కూడా మరికొన్ని కార్యక్రమాలను వారు నిర్వహిస్తూనే ఉన్నారు. లండన్లో రిసెప్షన్, అలాగే మనదేశంలో కొన్ని అన్నదాన కార్యక్రమాలు వంటివి చేస్తున్నారు. రాధికా, అనంత అంబానీలా పెళ్లిని ప్రపంచం మరిచిపోలేని విధంగా చేశారు ముఖేష్, నీతా అంబానీ. వీరి పెళ్లి ఖర్చు 5000 రూపాయల కోట్లుగా తేలింది.