
Best Web Hosting Provider In India 2024

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీపై మంచి బజ్ ఉంది. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఈ మాస్ యాక్షన్ మూవీ వస్తోంది. ఆగస్టు 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ చిత్రం నుంచి ‘మార్ ముంత.. చోడ్ చింత’ అంటూ మాస్ బీట్తో ఊపున్న సాంగ్ వచ్చింది. అయితే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను ఈ పాటలో ఉండటంతో వివాదం తలెత్తింది.
తెలంగాణ సీఎంగా ఉన్న సమయంలో ఓ ప్రెస్మీట్లో ‘ఏం జేద్దామంటావ్ మరి’ అని కేసీఆర్ అన్నారు. ఆ మాట సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయి.. ఫేమస్ మీమ్ అయింది. ఇప్పుడు కేసీఆర్ వాయిస్‌తోనే ఆ మాటను మార్ ముంత పాటలో మణిశర్మ వాడేశారు. అలాంటి పాటలో కేసీఆర్ వాయిస్ పెట్టడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం తీవ్రమైన తరుణంలో మణిశర్మ, ఈ పాటను రాసిన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఇప్పుడు వివరణ ఇచ్చారు.
కేసీఆర్ అందరి ఫేవరెట్
డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్లలో భాగంగా మార్ ముంత ముచ్చట్లు అని ఓ చిట్టాచ్ చేశారు మణిశర్మ, కాసర్ల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఈ క్రమంలో కేసీఆర్ మాటను వాడిన వివాదంపై ప్రస్తావన వచ్చింది. అయితే, మాజీ సీఎం కేసీఆర్ అందరి ఫేవరెట్ అని, ఆయనకు తాము హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని మణిశర్మ అన్నారు. ఇది ఎవరినీ కించపరిచేందుకు చేసిన పని కాదని, మీమ్‌ల నుంచే తీసుకున్నట్టు చెప్పారు.
బోరాన్, ఎంజాయ్ పండగో అనేవి మీమ్‌ల నుంచే తీసుకున్నామని, కేసీఆర్ మాటను కూడా మీమ్లాగే తీసుకున్నట్టు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అన్నారు.
ఇది ఐటమ్ సాంగ్ కాదు
మార్ ముంత సాంగ్‌ను ఐటమ్ సాంగ్ అని అందరూ అనుకుంటున్నారని, ఇది డ్యుయెట్ అని మణిశర్మ చెప్పారు. హీరోహీరోయిన్ల మధ్య పాట అని తెలిపారు. కేసీఆర్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు కూడా అప్పడప్పుడూ ఇలా మాట్లాడుతుంటారని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.
తన 27ఏళ్ల కెరీర్లో ఎవరినీ తాను నొప్పించలేదని మణిశర్మ చెప్పారు. ఈ పాట ద్వారా కేసీఆర్‌ను తలుచుకున్నామని అన్నారు. ఎవరైనా బాధపడి ఉంటే మన్నించాలని ఆయన తెలిపారు. కేసీఆర్ ఓ దిగ్గజం అని మణిశర్మ, కాసర్ల శ్యామ్ అన్నారు.
వివాదం ఇదే
మార్ ముంత పాటలో ‘ఏం జేద్దామంటావ్ మరీ’ అంటూ కేసీఆర్ వాయిస్‌ను మూవీ టీమ్ వాడేసింది. మందు తాగే ఐటమ్ సాంగ్‌లో కేసీఆర్ మాటను ఎలా వాడతారంటూ బీఆర్ఎస్ పార్టీలోని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఆగస్టు 15న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.