UTI and Sex: మహిళల్లో ఆ సమస్య ఉన్నప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనవచ్చా? ఎలాంటి సమస్యలు వస్తాయి?

Best Web Hosting Provider In India 2024

UTI and Sex: మహిళల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. అందులో ఒకటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తులు సెక్స్‌లో పాల్గొనవచ్చా? లేదా? అనేది ఎక్కువ మందికి ఉన్న సందేహం. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపిస్తుంది. అసౌకర్యంగాను ఉంటుంది. ఆ సమయంలో లైంగిక ప్రక్రియలో పాల్గొనాలంటే మహిళలు సందేహిస్తారు. అది మరింత బాధాకరంగా మారుతుందేమోనని భయపడుతూ ఉంటారు. ఎవరైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు వివరిస్తున్నారు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రశయం వంటి మూత్రవ్యవస్థల్లో ఏదైనా భాగాన్ని ప్రభావితం చేసే ఒక ఇన్ఫెక్షన్. అధికంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు దిగువ మూత్రనాళాల్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి. మూత్రాశయం, మూత్రనాళంలో ఈ బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడ మరిన్ని శిలీంధ్రాలు, వైరస్‌లు కూడా పుట్టుకొని వస్తాయి. ఏ భాగంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాలు ఉన్నాయో… దాన్నిబట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.

యూటీఐ లక్షణాలు

ఎవరికైనా మూత్ర విసర్జన తరచూ వస్తూ ఉన్నా, అలాగే జ్వరం, వికారం, వాంతులు ఉన్నా… అది ఎవరైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్లనేమోనని సందేహించాలి. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి రావడం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లక్షణాలు. మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి రావడం, చిన్న చిన్న మొత్తంలో మూత్ర విసర్జన కావడం కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్లనని చెప్పాలి. మూత్రం రంగు మారడం అంటే ఎరుపు, గులాబీ రంగు, ముదురు బ్రౌన్ రంగులో కనిపించినా లేక రక్తం కనిపించినా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే లెక్క. మూత్రం తీవ్రమైన వాసన వస్తున్నా కూడా ఈ వ్యాధి ఉందేమోనని ఆలోచించాలి. ముఖ్యంగా స్త్రీలలో పెల్విక్ భాగంలో నొప్పి పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు సెక్స్ లో పాల్గొనడం మహిళలకు కష్టతరంగా మారుతుంది.

చాలామంది సెక్స్ లో పాల్గొనడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అనుకుంటారు. అయితే సెక్స్ అనేది నేరుగా ఇలాంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు. కానీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం మాత్రం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్స్ చేస్తే ఆ బాక్టీరియా మూత్రాశయంలోకి సులువుగా చేరిపోతుంది. ముఖ్యంగా మహిళలకే ఇలా జరుగుతుంది. ఎందుకంటే మహిళల మూత్రనాళం పురుషుల కంటే చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి తగిన చికిత్స తీసుకోవడమే మంచిది.

ఒక అధ్యయనం ప్రకారం… సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యవంతమైన స్త్రీలకు, మెనోపాజ్ ఆగిపోయిన వారికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. సెక్స్ అనేది ఇన్ఫెక్షన్‌కు కారణం కానప్పటికీ, అది బ్యాక్టీరియాని మాత్రమే ప్రవేశించేలా చేయడానికి మాత్రం దోహదపడుతుంది.

నో సెక్స్

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు లైంగిక సంబంధం పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో సెక్స్ అనేది చాలా బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుంది. లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుంది. సమస్యను మరింతగా పెంచేస్తుంది. కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న మహిళలు ప్రధమంగా దానికి చికిత్స తీసుకుని ఆ తర్వాతే లైంగిక ప్రక్రియకు సిద్ధం అవ్వడం మంచిది. లేకుంటే ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి మరింత బాధను అనుభవించాల్సి వస్తుంది. బ్యాక్టీరియా వ్యాప్తి కూడా అధికంగా ఉంటుంది.

ప్రతిరోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచవచ్చు. దీనివల్ల బ్యాక్టీరియా కూడా మూత్రనాళాల ద్వారా బయటికి పోయే అవకాశం ఉంది. తరచూ మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్రం కూడా పల్చగా మారుతుంది. బ్యాక్టీరియాలను బయటకి తీసుకెళుతుంది. సెక్స్ లో పాల్గొనవలసి వస్తే లైంగిక ప్రక్రియకు ముందు, ఆ తర్వాత కూడా మూత్ర విసర్జన చేయడం చాలా మంచిది. దీనివల్ల మూత్రనాళంలోకి ప్రవేశించిన ఏదైనా బ్యాక్టీరియాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. జననేంద్రియ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024