Double ismart OTT Deal: భారీ ధరకు అమ్ముడైన డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు.. ఎన్ని కోట్లంటే..

Best Web Hosting Provider In India 2024

డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి జబ్ విపరీతంగా ఉంది. ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు చార్ట్‌బస్టర్లు అవడంతో ఇంకా హైప్ వస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా జరిగింది. దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులకు భారీ ధర వచ్చింది.

డీల్ వివరాలివే

డబుల్ ఇస్మార్ట్ సినిమా దక్షిణాది భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలను డిజిటల్ రైట్స్‌ను రూ.33కోట్ల భారీ ధరకు ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మేకర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

డబుల్ ఇస్మార్ట్ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ డీల్ ఇంకా జరలేదు. హిందీ హక్కులను ఏ ఓటీటీ తీసుకుంటుందో చూడాలి. హిందీలోనూ ఈ చిత్రానికి మంచి డీల్ వస్తుందని మూవీ టీమ్ ఆశలుగా ఉన్నాయి. అలాగే, ఈ మూవీకి తెలుగు సహా ఇతర భాషల శాటిలైట్ హక్కుల డీల్ కూడా ఇంకా జరగాల్సి ఉంది.

దక్షిణాది భాషల ఓటీటీ హక్కులకు డబుల్ ఇస్మార్ట్ మూవీకి రూ.33 కోట్లు వచ్చాయి. అయితే, రామ్ పోతినేనికి ఇదే ఓ రికార్డు. ఆయన ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ ఓటీటీ డీలే అత్యధికం. హిందీ వెర్షన్ అమ్ముడుపోయాక ఈ నంబర్ మరింత పెరుగుతుంది.

డబుల్ ఇస్మార్ట్ గురించి..

డబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్‍కు జోడీగా సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్‍పాండే, ఉత్తేజ్ కీరోల్స్ చేస్తున్నారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు మాస్ పాటలు దుమ్ముదులుపుతున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. లైగర్‌తో గట్టి దెబ్బ ఎదుర్కొన్న పూరి జగన్నాథ్.. డబుల్ ఇస్మార్ట్ మూవీతో మళ్లీ గెలుపుబాట పట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో థియేటర్లలో విడుదల కానుంది.

2019లో వచ్చిన బ్లాక్‍బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‍గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబో మరోసారి ఈ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని వారి ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. మాస్ ట్రీట్ అంటూ వేచిచూస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడటంతో వెంటనే ఆగస్టు 15ను డబుల్ ఇస్మార్ట్ ఫిక్స్ చేసుకుంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్‍’తో బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్ మూవీ తలపడనుంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024