Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు
న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెలరోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేత పత్రాల్లో విషయమేమీ ఉండడం లేదని ఆయన అన్నారు.
‘‘టీడీపీ ప్రభుత్వం పెడుతున్న శ్వేతపత్రాలతో.. తమ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చబోమని చేయబోమని చెప్పినట్లు అనిపిస్తోంది. ఇలాంటి వాటితో ప్రజలు విసుగుచెందారంటే.. ఊరుకోరు. సవాళ్లకు భయపడే చంద్రబాబు.. మిత్రపక్షాల కోసమే పరుగులు తీస్తుంటారని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే.. కూటమి పాలనలో నెలరోజుల్లోనే రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ఇంతకు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెలరోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.