OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 12 సినిమాలు- 9 స్పెషల్- 8 మూవీస్‌తోపాటు ఒక కామెడీ వెబ్ సిరీస్- ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Today OTT Releases: ఓటీటీలో ఒక్క శుక్రవారం రోజునే సినిమాలు వెబ్ సిరీసులు ఎక్కువగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందుకే ఫ్రైడేను మూవీ ఫెస్టివల్ డే అని కూడా అంటూ ఉంటారు. ఈ వారంలో మొత్తంగా 18కి పైగా ఓటీటీలోకి విడుదల కానుండగా వాటిలో ఒక్క ఫ్రైడేనే (జూలై 26) ఏకంగా 12 స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

 

అలాగే ఇవాళ (జూలై 27) కూడా ఒక కామెడీ డ్రామా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి అవేంటి, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటని చూస్తే..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మిస్టర్ అండ్ మిస్ మహి (హిందీ సినిమా)- జూలై 26

సవి (హిందీ చిత్రం)- జూలై 26

ఘోస్ట్ బస్టర్స్: ఫ్రొజెన్ ఎంపైర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 26

ది డ్రాగెన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 26

ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 26

జీ5 ఓటీటీ

భయ్యాజీ (హిందీ చిత్రం)- జూలై 26

ఛల్తే రహే జిందగీ (హిందీ సినిమా)- జూలై 26

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

బ్లడీ ఇష్క్ (హిందీ సినిమా)- జూలై 26

చట్నీ సాంబర్ (తమిళ వెబ్ సిరీస్)- జూలై 26

చందు ఛాంపియన్ (హిందీ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 26 (రెంటల్ విధానంలో)

పారడైజ్ (మలయాళ చిత్రం)- మనోరమా మ్యాక్స్ ఓటీటీ అండ్ సింప్లీసౌత్ ఓటీటీ- జూలై 26

విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ సినిమా)- జియో సినిమా ఓటీటీ- జూలై 26

భరతనాట్యం (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- జూలై 27

కామెడీ ఫాంటసీ జోనర్

ఇలా జూలై 26న ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు ఓటీటీలో వచ్చేశాయి. వీటిలో జాన్వీ కపూర్-రాజ్‌కుమార్ రావు నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ మిస్టర్ అండ్ మిస్ మహి చాలా స్పెషల్ కానుంది. అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సవి మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. అలాగే కామెడీ అండ్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఘోస్ట్ బస్టర్స్: ఫ్రొజెన్ ఎంపైర్ కూడా అలరించే సినిమా కానుంది.

 

హారర్ థ్రిల్లర్-బయోపిక్

వీటితోపాటు మనోజ్ భాజ్ పాయ్ మెయిన్ లీడ్ రోల్ చేసిన భయ్యా జీ మూవీ, అవికా గోర్ హారర్ థ్రిల్లర్ బ్లడీ ఇష్క్, తెలుగులో డబ్ అయిన తమిళ కామెడీ వెబ్ సిరీస్ చట్నీ సాంబార్, బయోపిక్ సినిమాగా వచ్చిన చందు ఛాంపియన్, మలయాళ క్రేజీ మూవీ పారడైజ్ చిత్రాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 9

ఇలా ఒక్క శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 12 సినిమాల్లో 8 కచ్చితంగా చూసేలా స్పెషల్ కానున్నాయి. వీటిలో ఒక్క వెబ్ సిరీస్ ఉండగా మిగతావన్నీ సినిమాలే. ఇక వీటితోపాటు ఇవాళ అంటే జూలై 27న భరతనాట్యం అనే తెలుగు సినిమా ఆహా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇది కూడా ప్రత్యేకం కానుంది. ఇలా చూసుకుంటే రెండు రోజుల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన 13 వాటిల్లో మొత్తంగా 8 సినిమాలు, 1 వెబ్ సిరీస్‌తో 9 ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.

3 నెలల తర్వాత

ఇదిలా ఉంటే, భరతనాట్యం సినిమా కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కింది. ఈ సినిమాలో సూర్యతేజ అయిలే, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రలుగా నటించారు. భరతనాట్యం సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. అంటే దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024