ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.06-8-2022 [శనివారం] ..
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రైమరీ పాఠశాలల విలీనంపై నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నాడు- నేడు [ఫేజ్-2] కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఢీల్లి రావు ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు- ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి ..
నందిగామ టౌన్ : నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ..