Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, ఇతర నేతలు పాల్గొన్నారు.