Best Web Hosting Provider In India 2024
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఉండేది చావు భయం. ఎవ్వరూ దాన్ని కోరుకోరు. ప్రతి వ్యక్తి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ మధ్య అందుకే రివర్స్ ఏజింగ్, బయో హ్యాకింగ్ వంటి అనేక పదాలు కూడా బాగా వినబడుతున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు, వైద్యులు యవ్వనంగా ఉంచే మార్గాల గురించి చెబుతున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ చీఫ్ వెల్నెస్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ రాయిజాన్ వయసు 78 ఏళ్లు. తన బయోలాజికల్ ఏజ్ ను 20 ఏళ్లకు పైగా తగ్గించుకున్నట్లు చెప్పారు. అంటే ప్రస్తుతం ఆయన వయసు 57.6 సంవత్సరాలు. దీనికోసం పాటించాల్సిన 3 మార్గాలేంటో ఆయన చెప్పారు.
బయోలాజికల్ వయసు అంటే?
బయోలాజికల్ వయస్సు అనేది శరీర కణాల వయసు. అంటే ఉదాహరణకు 50 ఏళ్ల వయసులో శరీర కణాలు 20 ఏళ్ల కుర్రాడితో పోలిస్తే అనారోగ్యంగా ఉంటాయి. కణాల ఆరోగ్యం.. వయసు బట్టి మారుతుంది. ఈ డాక్టర్ శరీర కణాలు 78 ఏళ్లలోనూ 57.6 వయసు వారికుండే కణాల్లాగా ఆరోగ్యంగా ఉన్నాయి. అదేదో మ్యాజిక్ వల్ల అలా జరగలేదు. ఆయన దానికోసం పాటించిన నియమాలు మనతోనూ పంచుకున్నారు. అవేంటో చూసేయండి.
కార్డియో వ్యాయామాలు:
డాక్టర్ రాయిజాన్ తన దీర్ఘాయువు గురించి, అతని ఆరోగ్య-ఫిట్నెస్ కోసం పాటించిన సూత్రాన్ని బిజినెస్ ఇన్సైడర్తో పంచుకుంటారు. అందులో మొదటిది కార్డియో. ఆయన వారానికి 3 సార్లు 48 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేస్తారట. ఇందుకోసం ట్రెడ్ మిల్ లేదా ఎక్సర్ సైజ్ బైక్ ను ఉపయోగిస్తాడు. బుధ, శని, ఆదివారాలకు ఆయన కార్డియో అని పేరు పెట్టారు. మీకు ట్రెడ్ మిల్ లేకపోతే, బ్రిస్క్ వాకింగ్ (1 నిమిషంలో 132 అడుగులు), రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా రోప్ జంపింగ్ చేయవచ్చు.
రెసిస్టెన్స్ ట్రైనింగ్:
డాక్టర్ మైఖేల్ వారానికి రెండుసార్లు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. దీర్ఘాయువు కోసం కండరాలు బలంగా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. వారానికి 30 నుంచి 60 నిమిషాల రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని 2022లో ప్రచురితమైన బ్రిటిష్ జర్నల్ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది. ఇందులో క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధులు కూడా ఉన్నాయి.
వాకింగ్:
కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ తో పాటు రోజూ 10 వేల అడుగులు నడవడం మర్చిపోరు డాక్టర్ మైఖేల్. ఇందుకోసం పని చేసే డెస్క్ ముందు ట్రెడ్ మిల్ ఉంచడం వంటి అనేక పద్ధతులను అవలంబిస్తారు. ఆఫీసుకు దూరంగా కారు పార్కింగ్ చేయడం మొదలైనవి పాటిస్తారు. దీంతో వారు బిజీగా ఉన్నా కూడా వారి లక్ష్యంగా పెట్టుకున్న అడుగుల సంఖ్య పూర్తవుతుంది. వారానికి 5 రోజులు బ్రిస్క్ వాక్ చేస్తే మెదడు ఆరోగ్యంగా ఉంటుందని, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని, ఆయుష్షు కూడా ఎక్కువ కాలం ఉంటుందని 2022లో జరిగిన మరో అధ్యయనంలో వెల్లడైంది.
టాపిక్