HCL Tech Bee: ఇంటర్‌ విద్యార్హతతో ఐటీలో ఉద్యోగాలు.. ఏపీలో జిల్లాల వారీగా రిక్రూట్‌మెంట్, దరఖాస్తు చేసుకోండి ఇలా…

Best Web Hosting Provider In India 2024

HCL Tech Bee: ఇంటర్ విద్యార్హతతో ఐటీ రంగంలో ఉపాధి కల్పించే హెచ్‌సిఎల్‌ టెక్‌ డిజిటల్ సపోర్ట్‌ కోర్సుల్లో ఎంపికలు చేపడుతున్న ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఈఓ సుర్జీత్ సింగ్ ప్రకటించారు. ఇంటర్ తర్వాత ఐటి రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాలను టెక్‌బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు అందిస్తారు. హెచ్‌సిఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ విద్యతో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

 

రాష్ట్రంలోని జిల్లాల వారీగా ప్రత్యేకమైన డ్రైవ్ లలో విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్ మీడియట్ లో ఒకేషనల్, సిఇసి, హెచ్ ఇ సి, బైపీసీ విద్యార్థులకు ఈ కార్యక్రమానికి అర్హులుగా ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఇంటర్ మీడియట్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐటి సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ విద్యను ఒక ఏడాది పాటు అందచేస్తారు. ఎంపికైన విద్యార్థులకు భారత దేశంలో పేరొందిన ఐటి కంపెనీల్లో ఒకటైన హెచ్ సి ఎల్ కంపెనీ డిజిటల్ విద్యను అందించి ఉపాధి కల్పిస్తారు. ఉపాధి పొందుతూనే విద్యార్థులు ఉన్నత విద్యను కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తారు.

ఇంటర్‌లో ఆ గ్రూపుల వారికే…

ఐటీ విద్యను పొందడానికి విద్యార్థులు ఇంటర్ మీడియట్ తత్సమాన కోర్సు ను 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులు తప్పనిసరిగా ఒకేషనల్, సిఇసి, హెచ్ ఇ సి, బైపీసీ గ్రూప్ లలో చదివి ఉండాలి.

ఏడాది కాలం పాటు టెక్ బీ ప్రోగ్రాం కు ఎంపిక అయిన అభ్యర్థులు శిక్షణ అనంతరం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధి పొందడానికి అర్హులుగా గుర్తిస్తారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట హెచ్‌సి‌ఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్ వ్యూ ఉంటుంది.

 

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రక్రియల్లో విజయం సాధించిన విద్యార్థులకు హెసిఎల్‌ నియామక పత్రాలు అందిస్తారు.

శిక్షణలో స్టైఫెండ్…

హెచ్‌సిఎల్‌ టెక్‌బికు ఎంపికైనా అభ్యర్థులకు ఏడాది పాటు మధురై, చెన్నై నగరాల్లో నెలకొన్న హెచ్‌సిఎల్ కేంద్రాల్లో శిక్షణను అందిస్తారు. మూడు నెలల పాటు తరగతి గదులలో శిక్షణ, మిగిలిన 9 నెలలు ఇంటర్న్ షిప్ ఉంటుంది. అభ్యర్థులకు నెలకు 10 వేల రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఎంపిక అయిన వారికి సంవత్సరానికి రూ. రూ.1.7 లక్షల వేతనం ఉంటుంది.

పనితీరు ఆధారంగా ప్రతీ సంవత్సరం వేతనంలో పెంపు ఉంటుందని చెప్పారు. హెచ్‌సిఎల్ లో ఉద్యోగం చేస్తూనే శాస్త్ర, అమిటీ, కెఎల్ యూనివర్సిటీలలో ఉన్నత విద్య పూర్తి చేసుకునే అవకాశం సైతం కల్పిస్తారు.

ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ కోసం https://registrations.hcltechbee.com/ ను సందర్శించండి. 2024 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇతర వివరాలకు 9642973350, 7780323850, 7780754278, 6363095030 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు.

జిల్లాల వారీగా ఎంపికల షెడ్యూల్

జిల్లాల వారీగా కృష్ణా ఆగష్టు 6న, నెల్లూరు ఆగష్టు 8న, గుంటూరు, ప్రకాశం, చిత్తూర్ లలో ఆగష్టు 9న, కడప ఆగష్టు 10న, కర్నూలు ఆగష్టు 13న, అనంతపురం ఆగష్టు 17న, పశ్చిమ గోదావరి ఆగష్టు 19న, తూర్పు గోదావరి ఆగష్టు 20న, విశాఖ ఆగష్టు 22న, విజయనగరం ఆగష్టు 23న, శ్రీకాకుళం ఆగష్టు 24 తేదీలలో ఐటి కోర్సు లలో ఎంపికకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. హెచ్‌సిఎల్‌ టెక్‌ బీ కార్యక్రమంలో భాగంగా గత కొన్నేళ్లుగా ఏపీలో కూడా ఉపాధి కల్పిస్తున్నారు. గన్నవరం మేధా టవర్స్‌లో ఉన్న హెచ్‌‌సిఎల్‌‌లో కూడా ఉద్యోగులు ఉన్నారు.

 
WhatsApp channel
 

టాపిక్

 
 
JobsGovernment Of Andhra PradeshAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024