







ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.06-8-2022 [శనివారం] ..
కంచికచర్ల పట్టణంలోని జంగాల కాలనీ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పట్టణంలోని “సచివాలయం-2” పరిధిలో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తెలిపిన మేజర్ సమస్యలను కలెక్టర్ ఢిల్లీ రావు దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం “ఒక సచివాలయం పరిధి పూర్తయ్యాక సచివాలయం పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎమ్మెల్యేలకు కేటాయించనున్న రూ.20 లక్షలు ప్రభుత్వ నిధులు త్వరితగతిన మంజూరు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపిన కలెక్టర్ ఢిల్లీ రావు ,ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల జంగాల కాలనీ లో ఖాళీ స్థలాల్లో డేరాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న నిరుపేదలు జంగాల వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు గారిని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
అదేవిధంగా కంచికచర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హాస్టల్ ను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ..