Kadiri News : చిట్టి దోసెలతో రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్న మహిళ, రుచి సూపర్ అంటూ కస్టమర్లు క్యూ

Best Web Hosting Provider In India 2024

Kadiri News : సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు జీతాలు లక్షల్లో ఉంటాయి. అందుకే నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎగబడుతుంటారు. అయితే రోడ్డు పక్కన దోసెలు అమ్ముకునే ఓ మహిళ టెక్కీలే ఆశ్చర్యపోయేలా సంపాదిస్తుంది. రోజుకు రూ.10 వేలు వ్యాపారం చేస్తామని నర్సమ్మ అంటున్నారు. ఇందులో గొప్పేంటి అనుకుంటున్నారా? రోడ్డు పక్కన చిన్న షెడ్డులో మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కాకా హోటల్ నడుపుతూ.. రోజుకు రూ.10 వేల వ్యాపారం చేస్తున్నారంటే…గొప్పే కదా అంటున్నారు స్థానికులు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి నర్సమ్మ ఆదర్శమే అంటున్నారు.

నర్సమ్మ దోసెలు రుచిచూడాల్సిందే

సత్యసాయి జిల్లాలోని కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సాఫీగా సాగుతుందని అంటున్నారు. నర్సమ్మ హోటల్ లో వివిధ రకాల దోసెలు విక్రయిస్తారు. ఎగ్ దోసెలు రూ. 25 , సాధారణ దోసెలు రూ. 10 , కారం దోసెలు రూ.25 అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు. రోడ్డు పక్కనే కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ హోటల్ కు వస్తుంటారు. నర్సమ్మ హోటల్ దోసెల రుచి తెలిసిన స్థానిక కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు అక్కడకు నిత్యం వస్తుంటారు. తక్కువ ఖర్చు, రుచికి అమోఘంతో నర్సమ్మ దోసెల కోసం క్యూ కడుతుంటారు. ఈ హోటల్ లో ఎగ్ దోసె ఫేమస్ అని నర్సమ్మ అంటున్నారు. సాధారణంగా ఒక దోసె తిందామని వచ్చిన వాళ్లు…ఆపకుండా లాగించేస్తారని అందుకే వ్యాపారం బాగా జరుగుతుందని నర్సమ్మ అంటున్నారు. తాను స్వయంగా తయారు చేసుకునే దోసె పిండి, రుచికరమైన చట్నీలు కారణంగానే కస్టమర్లు తరచూ వస్తుంటారని నర్సమ్మ తెలిపారు.

చట్నీ స్పెషల్

చూసేందుకు చిన్న షెడ్డులో ఉన్న ఈ హోటల్ మధ్యాహ్నం వరకూ కస్టమర్లతో కిటకిటలాడుతుంటుంది. నర్సమ్మ హోటల్ లో చట్నీలకు ఓ ప్రత్యేక ఉంది. అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, దాల్ చట్నీ అయితే సూపర్ అంటున్నారు కస్టమర్లు. ఎంత సంపాదించినా మూడు పూటలా భుక్తి కోసమే కదా, అందుకే తమ హోటల్ కు వచ్చే ప్రతి కస్టమర్ సంతృప్తి పరిచేలా దోసెలు తయారుచేస్తామని నర్సమ్మ అంటున్నారు. రోజుకు రూ.10 వేల వరకు వ్యాపారం జరుగుతుందని, అందులోనే మూడిపదార్థాల ఖర్చులు ఉంటాయని అంటున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsViral Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024