Best Web Hosting Provider In India 2024
OTT Movies: బాక్సాఫీస్ వద్దకు ప్రతి వారం సరికొత్త సినిమాలు వచ్చి అలరిస్తూనే ఉంటాయి. కలెక్షన్స్ కోసం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ పరుగులు పెడుతుంటాయి. వాటిలో లో బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, బాక్సాఫీస్ ముందు మాత్రం ఎంత బడ్జెట్‌తో తెరకెక్కించారనేది లెక్కలోకి రాదు.
కేవలం సినిమా ఎలా ఉంది, ఎంత డిఫరెంట్‌గా కంటెంట్ ఉందనవే సినీ ఆడియెన్స్ లెక్కలు వేసుకుని చూస్తారు. అందుకే భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతుంటే.. అతి తక్కువ వ్యయంతో తీసిన సినిమాలు అంతకుమించి కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. అలాంటి క్యాటగిరీకి చెందినదే ఇప్పుడు చెప్పుకునే సినిమా.
సినీ రంగంతోపాటు ఇతర రంగాల్లో పరిస్థితి ఎలా ఉందనేది కొవిడ్‌కు ముందు కరోనా తర్వాత అని చూస్తారు. కొవిడ్ తర్వాత థియేటర్లు వెలవెలబోగా.. ప్రీ కొవిడ్‌కు ముందు వచ్చిన కొన్ని సినిమాలు అల్టిమేట్ విజయాలను చవిచూశాయి. అలాంటి సినిమాల్లో బాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవీడ్, మాలీవుడ్ అనే తేడా చూడకుండా అందరి మెప్పు పొంది బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా ఉరి ది సర్జికల్ స్ట్రైక్. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలియని వారంటూ ఉండరు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2019లో రిలీజై బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించిన వసూళ్లను రాబట్టింది.
కేవలం రూ. 25 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఉరి మూవీ లాంగ్ రన్లో ఇండియాలో రూ. 245 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 342.06 కోట్ల షేర్ కలెక్షన్స్ కొల్లగొట్టి ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్‌గా చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 359.73 కోట్ల గ్రాస్ కూడా సాధించింది.
ఇండియా మీద పాకిస్తాన్ బలగాలు చేసిన కాల్పులకు భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్‌తో ఎలాంటి రివేంజ్ తీసుకున్నారనే కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉరి తెరకెక్కింది. పాక్ బలగాలను మట్టుపెట్టి ఎవరికీ ఏం జరగకుండా ఇండియన్ సోల్జర్స్ ఎలా భారత్‌కు చేరుకున్నారు అనేది ఉత్కంఠంగా చూపించారు డైరెక్టర్ ఆదిత్య ధర్.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే యాక్షన్ మూవీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉరి సినిమా జీ5 ఓటీటీలో హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఉరి సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు సమాచారం. పుల్వామా అటాక్ నేపథ్యంపై ఉరికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజ్ వరకు వచ్చిందని కొన్ని రోజుల్లో ఈ సీక్వెల్‌ను ప్రకటించనున్నారని సమాచారం. కాగా ఉరి మూవీలో విక్కీ కౌశల్, యామీ గౌతమ్, పరేష్ రావల్, మోహిత్ రైనా, కీర్తి కుల్హారి ఇతరులు కీలక పాత్రలు పోషించారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits