Anant and Radhika: నారింజ గౌనులో మెడలో నల్లపూసలతో, పెళ్లి తరువాత రాధికా మర్చంట్ ఫస్ట్ లుక్

Best Web Hosting Provider In India 2024

ప్రపంచమంతా తెలిసేలా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం చేసుకున్నారు. వివాహంలో డైమండ్ నగలతో మెరిసిపోయింది రాధికా. పెళ్లి తర్వాత నూతన వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పారిస్ 2024 ఒలింపిక్స్ లో కుటుంబ సభ్యులు ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ తో కలిసి సందడి చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు నీతా అంబానీ సహా అంబానీ కుటుంబం ఈ క్రీడలకు హాజరవుతోంది.

వారి పారిస్ విహారయాత్ర కోసం, నవ వధూవరులు కూడా హాజరయ్యారు. వారు వివాహ దుస్తుల్లో వైరల్ అయిన అనంత్, రాధికా జంట… పారిస్‌లో భిన్నంగా క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు. అనంత్ పూల చొక్కాతో కనిపిస్తే, రాధికా మర్చంట్ నారింజ రంగు ఫ్రాక్ లో కనిపించింది.

మెడలో నల్లపూసలతో రాధిక మర్చంట్

పారిస్ ఒలింపిక్స్ లో అంబానీ కుటుంబం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఈ వీడియోలో నూతన వధూవరులు స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కంఫర్ట్, స్టైల్ రెండూ కలిసిన రాధికా లుక్ అందంగా ఉంది. నారింజ రంగులో ఉన్న ఆమె దుస్తులు చతురస్రాకార నెక్లైన్, ఛాతీపై బటన్ అలంకరణతో, ఆకర్షణీయమైన బ్యాక్ లెస్ డిజైన్, ఫ్లేర్డ్ బాటమ్కలిగి ఉన్నాయి. వైట్ క్రాస్ బాడీ స్లింగ్ బ్యాగ్, వైట్ షూస్ ధరించింది. నో మేకప్ లుక్ లో, పోనీటెయిల్ ఆమె చక్కగా ఉంది. ముఖ్యంగా ఆమె మెడలో వేసుకున్న నల్లపూసలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన రాధికా నల్లపూసల దండను వేసుకుని సాంప్రదాయబద్ధంగా కనిపించింది.

మరోవైపు అనంత్ అంబానీ రిలాక్స్డ్ బ్లాక్ ప్యాంట్, ట్రెండీ షూస్ తో, ప్రింట్ షర్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అతను ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. రాధికా మర్చంట్ – అనంత్ అంబానీ కలిసి పక్కపక్కన కూర్చుంటే, వారి ముందు వరుసలో ముకేష్, ఇషా, ఆనంద్ పిరమాల్ కూర్చున్నారు. కుటుంబ పెద్ద ముకేశ్ అంబానీ క్లాసిక్ బ్లూ అండ్ వైట్ షర్టును ధరించారు. ఇక ఇషా అంబానీ తెల్లటి దుస్తులను ధరించగా, ఆమె భర్త ఆనంద్ పిరమాల్ సాధారణ తెలుపు చొక్కాను ఎంచుకున్నారు.

అనంత్-రాధిక పెళ్లి గురించి

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రస్తుతం తమ వివాహాన్ని ఆస్వాదిస్తున్నారు. జూలై 12న వివాహం చేసుకున్న ఈ జంట గుజరాత్ లోని జామ్ నగర్ లో తొలిసారిగా భార్యాభర్తలుగా కనిపించారు. వీరికి స్థానికులు ఘనస్వాగతం పలకడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి హృదయపూర్వక అభినందనలు అందుకున్నారు. ప్రపంచ మంతా తెలిసేలా ముకేష్ అంబానీ దంపతులు తమ చిన్నకొడుకు అనంత్ పెళ్లిని నిర్వహించారు. పెళ్లి జరిగిన మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీ ‘శుభ్ ఆశీర్వాద్’ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024