Bigg Boss Sivaji: ఐదు జంటల మధ్య ఫైట్- శివుడిపై సీన్స్- మెప్పించే ట్విస్టులతో మూవీ

Best Web Hosting Provider In India 2024

Bigg Boss Sivaji Kaalam Rasina Kathalu: అనేక రకాలైన కంటెంట్‌తో సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే కాకుండా కుటుంబాకథా చిత్రాలు సైతం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. మంచి ఎమోషనల్ సీన్స్‌తో బలమైన పాయింట్‌తో మూవీస్ వస్తే ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.

ఇక భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణలతో వచ్చే సినిమాలు చాలా వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాంటిది ఏకంగా ఐదు జంటల మధ్య జరిగే సంఘర్షణలతో సినిమాను తెరకెక్కిస్తే. అలాంటి కాన్సెప్ట్‌తోనే వస్తున్న సినిమా కాలం రాసిన కథలు. ఎమ్‌ఎన్‌వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రమే ఈ కాలం రాసిన కథలు.

తాజాగా ఈ కాలం రాసిన కథలు మూవీ విడుదల తేది పోస్టర్‌ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫేమ్, సీనియర్ హీరో శివాజీ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం శివాజీ కాలం రాసిన కథలు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శివాజీ మాట్లాడుతూ “ఈ చిత్రం టైటిల్ అండ్ కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అని అభిలాషిస్తూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే దర్శక నిర్మాత అయిన ఎమ్‌ఎన్‌వీ సాగర్ మాట్లాడుతూ.. “మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందిన మా చిత్రం ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు” అని తెలిపారు.

“ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ కాలం రాసిన కథలు సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్‌లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షలులని రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి” అని దర్శకనిర్మాత ఎమ్‌ఎన్‌వీ సాగర్ వెల్లడించారు.

“ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అని కాలం రాసిన కథలు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల సందర్భంగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎమ్‌ఎన్‌వీ సాగర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ కాలం రాసిన కథలు సినిమాలో డైరెక్టర్ ఎమ్‌ఎన్‌వీ సాగర్‌తోపాటు శృతి శంకర్, వికాస్, విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల, పల్లవి రాథోడ్, రేష్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

యస్‌యమ్ 4 ఫిలిమ్స్ బ్యానర్‌పై సాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత- రచయిత- దర్శకుడిగా ఎమ్‌ఎన్‌వీ సాగర్ వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్‌గా ఎస్. ప్రసాద్, ఎడిటింగ్ ప్రదీప్. జె బాధ్యతలు చేపట్టగా సంగీతాన్ని మేరుగు అరమాన్ అందిస్తున్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024