Raj Tharun – Lavanya: ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి.. వివాదంపై స్పందించిన రాజ్‍తరుణ్.. బయట లావణ్య గొడవ

Best Web Hosting Provider In India 2024

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, నటి లావణ్య మధ్య వివాదం కొంతకాలంగా హాట్‍టాపిక్‍గా మారింది. తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరం కాపురం కూడా చేశామని లావణ్య ఇటీవల ఆరోపించారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పరిచయం అయిన తర్వాత తనను వదిలేశారని పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. తనకు రాజ్ అబార్షన్ కూడా చేయించారని ఆరోపించారు. ఈ వివాదం దుమారం రేపింది. అయితే, ఇది జరిగాక రాజ్ తరుణ్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తిరగబడరా సామి సినిమా కోసం నేడు (జూలై 31) ప్రెస్‍మీట్‍లో పాల్గొన్నారు. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రానే హీరోయిన్. దీంతో ఈ ప్రెస్‍మీట్‍లో లావణ్య వివాదంపైనే రాజ్ తరుణ్‍కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ప్రశ్నల వెల్లువ

పెళ్లి చేసుకొని వదిలేశావని, అబార్షన్ చేయించావని లావణ్య అన్ని ఆరోపణలు చేస్తున్నా మీడియా ముందుకు ఎందుకు రాలేదని రాజ్‍తరుణ్‍ను జర్నలిస్టులు ప్రశ్నించారు. ఓ అమ్మాయి బయటికి వచ్చి అన్ని విషయాలు చెబుతుంటే సైలెంట్‍గా ఎందుకు ఉన్నారంటూ గట్టిగా అడిగారు. దీంతో రాజ్‍ తరుణ్ స్పందించారు. లీగల్‍గా ముందుకు వెళతానని, తాను ఎలాంటి తప్పు చేయలేదనే నిరూపించుకుంటానని చెప్పారు. తాను హిట్ కొట్టినప్పుడు కూడా ఇంత మంది రాలేదని, చూస్తే భయమేస్తోందని వెటకారంగా అన్నారు రాజ్.

ఆధారాలు అడిగారా!

లావణ్య చేసిన ఆరోపణలు అందరూ విన్నారని, కానీ ఆమెను ఎవరైనా ఆధారాలు అడిగారా అని తిరిగి ప్రశ్నించారు రాజ్‍ తరుణ్. ఆధారాలు చూపకుండా వారు కోర్టులో చూపిస్తామని అంటున్నారని తెలిపారు. “ఆరోపణలు చేసే వారు వచ్చి బయట మాట్లాడతారు. నేను ఆరోపణలు చేయడం లేదు. ప్రతీ దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను లీగల్‍గా ముందుకు సాగుతా. నేను భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కచ్చితంగా లీగల్‍గా ప్రొసీడ్ అవుతున్నా. వారు మాట్లాడే మాటలు విన్నారు కానీ.. ఏ రోజైన ప్రూఫ్ అడిగారా. వాళ్లు ఆధారాలు చూపించలేదు. కోర్టులో చూపించుకోవాలని అన్నారు. దయచేసి ఆ టాపిక్ గురించి కాకుండా.. సినిమా గురించి మాట్లాడదాం” అని రాజ్ తరుణ్ అన్నారు.

నోటీసులు ఇచ్చారు.. స్పందించా..

తాను అబార్షన్ చేయించినట్టు ఎఫ్‍ఐఆర్‌లో ప్రస్తావించలేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. దానిపై కేసు ఎందుకు లేదని అన్నారు. లావణ్య నుంచి తనకు నోటీసులు వచ్చాయని, తాను స్పందించానని రాజ్ తరుణ్ చెప్పారు. ఈ విషయం గురించి ఇక తాను మాట్లాడనని అన్నారు. అయితే, పదేపదే ఆయనకు ఈ అంశం గురించే ప్రశ్నలు ఎదురవటంతో ఇబ్బంది పడ్డారు.

లావణ్యను అడ్డుకున్న పోలీసులు

తిరగబడరా సామి ప్రెస్‍మీట్ జరుగుతున్న ప్రసాద్ ల్యాబ్స్ బయట లావణ్య గొడవ చేశారు. తాను లోపలికి వెళ్లి రాజ్‍ తరుణ్‍తో మాట్లాడతానంటూ పోలీసులతో వారించారు. తన భర్త రాజ్‍తో మాల్వీ ఎందుకు సంసారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ తరుణ్ తన నుంచి తప్పించుకు తిరుగుతున్నారని లావణ్య ఆరోపించారు.

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన తిరగబడరా సామి సినిమా ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీకి రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024