Anchor Jhansi: పవన్ కోసమే ఇక్కడికి వచ్చాను.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై నటి, యాంకర్ ఝాన్సీ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Actress And Anchor Jhansi About Pavan: బుల్లితెరపై యాంకర్‌గా ఎన్నో ఏళ్లు అలరించారు నటి ఝాన్సీ. యాంకర్‌గానే కాకుండా నటిగా అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న యాంకర్, నటి ఝాన్సీ యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

ఈ యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఝాన్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి తాజాగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సినిమానే యావరేజ్ స్టూడెంట్ నాని. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా ఆగస్ట్ 2న థియేటర్లలో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల యావరేజ్ స్టూడెంట్ నాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు, ఇతర టెక్నిషియన్స్‌తోపాటు నటి ఝాన్సీ ఆసక్తికర విశేషాలు చెప్పారు.

“యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల్లో నటించినా.. ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చాను. పవన్ కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చాను. యావరేజ్ స్టూడెంట్ నాని ఎలా ఉన్నా.. ఆ నాని తల్లి కూడా ఇలానే ఉంటుంది. ప్రతీ తల్లికి తన నాని తప్పు చేయడనే నమ్ముతుంది” అని నటి ఝాన్సీ తెలిపారు.

“ఫోన్‌లోనే పవన్ కథ చెప్పాడు. సరైన టీంను వెతికి పట్టుకున్నాడు. నానికి తన రైటింగ్ మీద నమ్మకం ఉంది. సినిమా చూసిన తరువాత నాని కథ, పవన్ గురించి అందరికీ అర్థం అవుతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని యాంకర్ ఝాన్సీ పేర్కొన్నారు.

ఇంకా ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి కొడకండ్ల మాట్లాడుతూ.. “పవన్‌తో ఇది వరకు నేను మెరిసే మెరిసే చిత్రానికి పని చేశాను. ఈ చిత్రంలోనూ మంచి పాటలు పడ్డాయి. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా పెద్ద విజయం అవుతుందని ఆశిస్తున్నాను” అని ఆకాంక్షించారు.

“విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించేశారు. సాంగ్స్ బాగా వచ్చాయి. ఇలా అన్నీ అద్భుతంగా వచ్చాయి. టైటిల్ మాత్రం యావరేజ్ అని పెట్టారు. కానీ, ఇది థియేటర్‌లో బ్లాక్ బస్టర్ అవుతుంది” అని యావరేజ్ స్టూడెంట్ నాని ఎడిటర్ ఉద్ధవ్ చెప్పారు.

“పవన్ నాకు పూర్తి స్క్రిప్ట్ ఇచ్చారు. కథ చదివాక నాకు బాగా నచ్చింది. పవన్‌కు, నాకు సేమ్ సెన్సిబిలిటీస్ ఉన్నాయనిపించింది. హీరోయిన్స్ అద్భుతంగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ఎంతో సరదాగా సాగింది. పవన్ అందరినీ కంఫర్టబుల్‌గా చూసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ సినిమాను చూసి సక్సెస్ చేయండి” అని కెమెరామెన్ సజీష్ రాజేంద్రన్ పేర్కొన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024