Best Web Hosting Provider In India 2024
Squid Game Season 2: స్క్విడ్ గేమ్ సిరీస్ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్‌ను వినిపించింది. సీజన్ 2 రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది. స్క్విడ్ గేమ్ సిరీస్ వ్యూయర్‌షిప్ పరంగా పలు రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంచి వీక్షించిన సిరీస్‌గా నిలిచింది. తొలి నాలుగు వారాల్లోనే 142 మిలియన్ల మంది ఈ సిరీస్‌ను చూశారు. అంతే కాకు్ండా 1.65 బిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. గోల్డెన్‌గ్లోబ్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నది.
డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్…
స్క్విడ్ గేమ్ సిరీస్‌కు సీజన్ 2 రాబోతోంది. గురువారం సెకండ్ సీజన్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. డిసెంబర్ 26 నుంచి స్క్విడ్ గేమ్ సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అంతే కాకుండా ఫైనల్ సీజన్‌ను వచ్చే ఏడాది (2025లో) రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్ అభిమానులతో పంచుకున్నది. స్టేడియంలోని రన్నింగ్ ట్రాక్‌లో కొంతమంది పరుగులు తీస్తున్నారు. కొంతమంది కిందపడిపోగా వారిని షూట్ చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. రియల్ గేమ్ బిగిన్స్ అంటూ చివరలో వచ్చిన క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
స్క్విడ్ గేమ్ ఫస్ట్ పార్ట్ కథ ఇదే…
ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో సతమతమవుతోన్న 456 మంది స్క్విడ్ గేమ్ ఆటలో పాల్లొంటారు. ఈ గేమ్ రూల్స్ విచిత్రంగా ఉంటాయి. ఓడిపోయిన వారిని చంపేస్తుంటారు. సింపుల్ గేమ్స్‌తో మొదలైన ఆటలో చివరకు ఇద్దరే ఎలా మిగిలారు? విజేతగా ఎవరు నిలిచారు? డబ్బు కోసం గేమ్‌లో పాల్గొన్న వారు ఒకరినొకరు ఎలా మోసం చేసుకున్నారు అన్నదే ఈ సీరిస్ కథ.
ఊహలకు అందని ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లతో హ్యాంగ్ డ్యాంగ్ హ్యూక్ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు. ఆడియెన్స్‌కు సిరీస్ ద్వారా థ్రిల్లింగ్‌ను పంచుతూనే సౌత్ కొరియాలో ఉన్న పేద, ధనికుల మధ్య ఉన్న అంతరాలు, పెట్టుబడిదారి వ్యవస్థను ఈ మూవీలో చూపించాడు. పేదల జీవితాలతో కొందరు ధనికులు ఆడే ఆటలను విభిన్నంగా ఈ సిరీస్‌లో చర్చించాడు డైరెక్టర్. స్క్విడ్ గేమ్‌లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీలక పాత్రల్లో నటించారు.
తొమ్మిది ఎపిసోడ్స్…
మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్‌తో స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ రూపొందింది. సీజన్ 2లో కూడా తొమ్మిది ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. డిఫరెంట్ గేమ్స్‌తో సెకండ్ సీజన్ సాగబోతున్నట్లు వీడియో చూస్తుంటే తెలుస్తోంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2ను కొరియన్, ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.