Best Web Hosting Provider In India 2024
Karthika deepam 2 serial today august 1st episode: నిశ్చితార్థం ఆగిపోవడానికి నువ్వే కారణం అంటూ జ్యోత్స్న దీపను కడిగిపారేస్తుంది. ఆగిపోయిన మీ నిశ్చితార్థం జరుగుతుంది, మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అని దీప అంటుంది. మా మమ్మీ నా బాధ్యత కూడా నీకే ఇచ్చేసిందా అని జ్యోత్స్న వెటకారంగా సుమిత్రను అడుగుతుంది.
మా మమ్మీని దూరం చేశావ్
మాట్లాడింది చాలు లోపలికి వెళ్ళు అని తిడుతుంది. సారి దీప నిన్ను ఇబ్బంది పెట్టినందుకు మా మమ్మీ ఫీల్ అవుతుంది. అసలే నువ్వు ప్రాణ దాతవి మా అమ్మ నీ కోసం గుండెల్లో చిన్న సైజ్ గుడి కట్టుకుంది. ఏదో ఒక రోజు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావని అంటుంది.
జ్యోత్స్న ఇక చాలు దీప వల్ల నిశ్చితార్థం ఆగిపోయిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. మన ఇంట్లో ఎవరికైనా ఇలాగే జరిగితే కార్తీక్ ఇలానే చేసేవాడని సుమిత్ర అంటుంది. దీప మన ఇంటి మనిషా ఇంకాసేపు అయితే తను నీ కూతురు అంటావ్. థాంక్స్ దీప నువ్వు మా బావనే అనుకున్నా మా మమ్మీని కూడా దూరం చేశావని జ్యోత్స్న కోపంగా అనేసి వెళ్ళిపోతుంది.
నేను రాకుండా ఉన్నా బాగుండేదని దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అది దాని మాటలు పట్టించుకోవద్దు. దాన్ని చెల్లెలు అనుకుని క్షమించమని సుమిత్ర అడుగుతుంది. తప్పు చేసింది నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉంటే నరసింహ ఇంటికి వచ్చేవాడు కాదని బాధపడుతుంది.
కార్తీక్, జ్యోత్స్న పెళ్లి నువ్వే జరిపించాలి
నీ మనసు ఏంటో మాకు తెలుసు. నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. శౌర్య గురించి ఆలోచించు. సమస్య ఏదైనా కానీ నీకు ఈ అమ్మ ఉందని మర్చిపోకు. నువ్వు ఇక్కడే ఉంటున్నావ్ నా కూతురి పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలని సుమిత్ర నచ్చజెప్తుంది. తన మాటలకు దీప ఎమోషనల్ అవుతుంది.
కార్తీక్ ఇంటికి వస్తాడు. ఏంటి అప్పుడే ఇంటికి వచ్చారు శౌర్యను డిశ్చార్జ్ చేశారా లేకపోతే హాస్పిటల్ గేటు దాటి కూడా బయటకు రారు కదాని శ్రీధర్ కార్తీక్ మీద అరుస్తాడు. నిశ్చితార్థం ఆగిపోయినందుకు మీ అమ్మ తలతిరిగి పడిపోయిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు.
కొడుకుపై శ్రీధర్ ఫైర్
శౌర్యకు బాగోకపోతే మాత్రమే స్పందిస్తారా తల్లికి బాగోకపోతే స్పందించరా అని తిడతాడు. పాపను వాడు మాత్రమే తీసుకెళ్ళాలా ఇంకెవరూ తీసుకెళ్లడానికి లేదా అని ప్రశ్నిస్తాడు. నరసింహ దీపను చంపేసినా చూస్తూ ఉండాలా? శౌర్య కళ్ళు తిరిగి పడిపోయింది. పైగా దాని గుండె అని కార్తీక్ విషయం చెప్పకుండా ఆగిపోతాడు.
అత్తయ్య అర్థం చేసుకుంది మీరేందుకు అర్థం చేసుకోవడం లేదు. అసలు మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయేది కాదు. జరిగింది అర్థం చేసుకొని హాస్పిటల్ కి వచ్చేవాళ్ళు. మనసులో లేనిపోని భయాలు పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ ఒక్కటి నిజం మీరు తలదించుకునే తప్పు మీ కొడుకు ఎప్పుడూ చేయడని కార్తీక్ కోపంగా చెప్తాడు.
లాయర్ ని కలిసిన నరసింహ
నా కూతురిని నాకు అప్పగించమని కోర్టులో కేసు వేయబోతున్నానని నరసింహ చెప్తాడు. అనసూయ వద్దు దీప వెనుక డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కోర్టు, లాయర్లు అంటే లక్షలతో పని మన వల్ల ఎక్కడ అవుతుందని అంటుంది. కానీ శోభ మాత్రం దీప బిడ్డను తీసుకొచ్చి దాని మీద పగ తీర్చుకోవాలని రెచ్చగొడుతుంది.
నువ్వు ఇదే మాట మీద ఉండు వెళ్ళి బిడ్డను తీసుకొస్తానని నరసింహ అంటాడు. వెంటనే లాయర్ దగ్గరకు వెళతాడు. నా భార్య నన్ను వదిలేసి వేరే డబ్బున్న వాడితో ఎఫైర్ పెట్టుకుంది. నా కూతురు దాని దగ్గర ఉంది. తనని సరిగా చూసుకోవడం లేదు. నా కూతురు అంటే నాకు ప్రాణం ఇచ్చేయమంటే ఇవ్వడం లేదు.
ఎలాగైనా కోర్టు ద్వారా తన కూతురిని ఇప్పించమని అడుగుతాడు. కేసు టేకప్ చేస్తున్నట్టు లాయర్ చెప్తాడు. సాక్ష్యాలతో కోర్టుకు రమ్మని పంపిస్తాడు. ఇప్పుడు దీప, కార్తీక్ సంబంధం ఉందని సాక్ష్యాలు ఎలా పుట్టించుకురావాలని ఆలోచిస్తాడు. దీపకు కోర్టు నోటీస్ వస్తుంది.
పారును ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న దశరథ
జ్యోత్స్న మనం చెప్పిన మాట వినాలంటే అత్తయ్య ఇంట్లో ఉండకూడదని సుమిత్ర దశరథకు చెప్తుంది. పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నువ్వు ఎంత పెద్ద సమస్యలో ఉన్నావో తెలుసా అని పారిజాతం అంటుంటే ఏం సమస్య అని దశరథ అడుగుతాడు.
ఇప్పుడు నువ్వు అన్న ఏ సమస్య ఈ ఇంటికి జ్యోత్స్నకు లేదు. కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది. మళ్ళీ ముహూర్తం పెట్టించి జరిపిస్తాము. నువ్వు లేనిపోనివి మాట్లాడి దాని మనసు చెడగొట్టొద్దు. నువ్వు కొద్ది రోజులు మీ ఊరు వెళ్తే మంచిది. ముహూర్తాలు పెట్టగానే కాల్ చేస్తాను అప్పుడు రావచ్చని దశరథ ఖరాఖండిగా చెప్తాడు.
నేను ఊరు వెళ్లిపోతే జరిగేది కార్తీక్, దీప పెళ్లి. అలా జరగకూడదు కార్తీక్, జ్యోత్స్న పెళ్లి జరగాలంటే ఇక్కడే ఉండాలని పారిజాతం మనసులో అనుకుంటుంది. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోతాను ఏదో నా భయాలు నాకున్నాయని పారిజాతం అంటుండగా దీప నోటీస్ పట్టుకుని కంగారుగా వస్తుంది.
శౌర్యను ఇవ్వమని నోటీస్
సుమిత్ర అది చదివి టెన్షన్ పడుతుంది. ఇది నీకు నరసింహ పంపించాడు. నా కూతురు నాకు కావాలని లాయర్ ద్వారా నోటీసు ఇప్పించాడని చెప్తాడు. ఇప్పుడు ఏమవుతుందని దీప భయంగా అడుగుతుంది. ఏమవుతుంది ఇప్పుడు నీ కేసు కోర్టుకు వెళ్ళిందని పారిజాతం చెప్తుంది.
నిశ్చితార్థం రోజు ఇంట్లో జరిగిన గొడవ కోర్టులో జరుగుతుంది. పర్లేదు నీ మొగుడిది మట్టి బుర్ర అనుకున్న తెలివైన వాడేనని అంటుంది. నీ కూతురిని ఇచ్చేసి ఉంటే నా మనవరాలి నిశ్చితార్థం ఆగిపోయేది కాదని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నరసింహ కోర్టు ద్వారా వాడి కూతురిని తీసుకునిపోతాడు. అప్పుడు దీప అపగలుగుతుందా?
టెన్సిన్ లో దీప
ఇప్పుడే తుఫాన్ మొదలైంది. ఇది ఆగిపోవాలంటే దీప శౌర్యను తీసుకెళ్ళి ఇచ్చేయాలి. ఇది తన వల్ల కాదని అనుకుంటే దీప కూడా వెళ్ళి భర్తతో ఉంటే అసలు ఏ గొడవ ఉండదని అంటుంది. దీప కంగారుగా నా కూతురిని నా నుంచి దూరం చేసుకోలేను. మీరే ఎలాగైనా కాపాడండి అని దశరథ కాళ్ళు పట్టుకోబోతుంది.
నా కూతురు ఆ దుర్మార్గుడి దగ్గరకు వెళ్లకూడదు మీరే ఏదో ఒకటి చేయండని సుమిత్ర కాళ్ళు పట్టుకుంటుంది. కోర్టు నోటీసు వచ్చిందంటే నీ కూతురు తండ్రితో వెళ్ళినట్టేనని పారిజాతం దీపను మరింత భయపెడుతుంది. నా కూతురిని ఆ దుర్మార్గుడి దగ్గరకు వెళ్ళకుండా ఎలాగైనా కాపాడుకోవాలని దీప చాలాఅక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. భయపడుతుంది.
టాపిక్