Best Web Hosting Provider In India 2024
Sarfira OTT: అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా తిరక్కుండానే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలతో పాటు ఐదు జాతీయ అవార్డులను గెలుచుకున్న సూరారై పొట్రు మూవీకి రీమేక్‌గా సర్ఫిరా తెరకెక్కింది. మాతృకకు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ రీమేక్ డైరెక్షన్ చేశారు.
అక్షయ్ కెరీర్‌లో లోయెస్ట్ కలెక్షన్స్…
భారీ అంచనాల నడుమ రిలీజైన సర్ఫిరా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్‌లో అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 30 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు యాభై కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో…
తాజాగా సర్ఫిరా మూవీ నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ డ్రామా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. ఆగస్ట్ 9 న సర్ఫిరా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ మూవీని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ థియేటర్ రిజల్ట్ కారణంగానే నెల రోజుల ముందే ఈ మూవీ ఓటీటీలోకి వస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సూర్య ప్రొడ్యూసర్…
సర్ఫిరా మూవీలో రాధిక మదన్, పరేష్ రావల్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూరారై పొట్రులో హీరోగా నటించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హిందీ రీమేక్‌లో గెస్ట్ పాత్రలో నటించాడు. అంతే కాకుండా ఈ మూవీకి సూర్య ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహించాడు. అక్షయ్ కుమార్ సినిమాతోనే నిర్మాతగా సూర్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నేషనల్ అవార్డు….
సూర్య హీరోగా నటించిన సూరారై పొట్రు మూవీ కొవిడ్ కారణంగా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా సూర్య నేషనల్ అవార్డు అందుకున్నారు. మరో నాలుగు విభాగాల్లో ఈ మూవీ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నది. సూరారై పొట్రు మూవీ తెలుగులోనూ ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ అయ్యింది.
విమర్శలు దక్కాయి కానీ…
ఏయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సర్ఫిరా మూవీ రూపొందింది. సంపన్నులకు మాత్రమే సాధ్యమైన విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఓ యువకుడుసాగించిన జర్నీని హృద్యంగా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీలో చూపించారు.
సొంతంగా ఏవియేషన్ సంస్థను నెలకొల్పేందుకు వీర్ మహాత్రే అనే యువకుడు పడిన కష్టాలు, ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులను సర్ఫిరా మూవీలో చూపించిన తీరుకు, అక్షయ్ నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా సర్ఫిరా మూవీ అనుకున్న స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోయింది.
నాలుగేళ్లలో పదహారు ఫ్లాప్‌లు…
గత నాలుగేళ్లలో అక్షయ్ కుమార్‌కు ఇది పదహారో ఫ్లాప్. ఈ ఏడాది భడేమియా ఛోటా మియాతో పాటు గత ఏడాది సెల్ఫీ, మిషన్ రాణిగంజ్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టాయి.