Best Web Hosting Provider In India 2024
Akhil Agent Movie: సినిమా రిలీజై ఏడాది దాటిన అఖిల్ ఏంజెట్ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓటీటీలో రిలీజ్ కాకుండానే ఈ మూవీ తెలుగు వెర్షన్ అన్‌లైన్‌లో కొన్ని పైరసీ సైట్స్‌లో దర్శనమిచ్చింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లు, స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
సోనీ లివ్ ఓటీటీలో…
ఈ సినిమా తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ దక్కించుకున్నది. థియేటర్లలో ఏజెంట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ ఎఫెక్ట్ కారణంగా థియేటర్లలో రిలీజై ఏడాది దాటిపోయిన ఈ మూవీ ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇటీవలే హిందీ వెర్షన్ టీవీలో టెలికాస్ట్ అయ్యింది. కానీ తెలుగు వెర్షన్ మాత్రం ఓటీటీతో పాటు టీవీల్లోకి రాలేదు. తాజాగా ఆన్‌లైన్‌లో ఈ మూవీ లీకవ్వడంతో..ఈ సినిమాను చూడటానికి ఇదొక్కటే దారి అంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
ఎనభై కోట్ల బడ్జెట్ – 30 కోట్ల కలెక్షన్స్…
స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో సాక్షివైద్య హీరోయిన్‌గా నటించింది. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఏజెంట్ మూవీని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ నిర్మాతలతో పాటు అఖిల్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. థియేటర్లలో కేవలం ముప్పై కోట్లలోపే వసూళ్లను రాబట్టి గత ఏడాది అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతకు యాభై కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఏజెంట్ దెబ్బకు అఖిల్ ఏడాదిపైనే సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.
ఏజెంట్ కథ ఇదే…
రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) చిన్నతనం నుంచి రా ఏజెంట్ కావాలని కలలు కంటుంటాడు. కానీ మూడు సార్లు ఇంటర్వ్యూలో ఫెయిలవుతాడు. తాను గురువుగా భావించే రా చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్‌ను రిక్కీ హ్యాక్ చేసి అతడి మెప్పును పొందుతాడు.ఆపరేషన్ రాబిట్ పేరుతో ఇండియాలో పలు చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు గాడ్ అలియా ధర్మ (డినో మారియా) కుట్రలు పన్నుతాడు. ఈ బాంబు దాడులను అడ్డుకోనే బాధ్యతను రిక్కీకి అప్పగిస్తాడు మహదేవ్.ఈ ప్రయత్నంలో రిక్కీ సక్సెస్ అయ్యాడా? ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం రిక్కీని మహదేవ్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏమిటి? ధర్మతో మహదేవ్‌కు సంబంధం ఉందా? తాను గురువుగా భావించే మహదేవ్‌ను చంపాల్సిన పరిస్థితులు రిక్కీకి ఎందుకొచ్చింది? రిక్కీ ప్రేమించిన వైద్య ఎవరన్నదే ఏజెంట్ మూవీ కథ.
అఖిల్ మేకోవర్…
ఏజెంట్ మూవీ కోసం అఖిల్ చాలా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ చేయడమే కాకుండా తన హెయిర్ స్టైల్, లుక్ మార్చుకొని నటించాడు. రొటీన్ కాన్సెప్ట్ కావడం, స్పై యాక్షన్ సినిమాల్లో ఉండే సీరియనెస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏజెంట్‌లో మిస్సవ్వడంతో ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పించలేకపోయింది.
ఏజెంట్ తర్వాత ఓ ఫాంటసీ యాక్షన్ మూవీలో అఖిల్ నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.