Best Web Hosting Provider In India 2024
Raj Tarun Vs Lavanya Vs Shekar Basha: హీరో రాజ్ తరుణ్, అతని ఎక్స్ లవర్ లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని కూడా చేశాడని హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
డిబెట్స్ కొనసాగిస్తూ
ఈ ఫిర్యాదుపై పోలీసుల విచారణ, రాజ్ తరుణ్‌ను విచారణ ప్రక్రియకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా వేదికగా డిబెట్స్ కొనసాగిస్తోంది లావణ్య. అయితే, లావణ్యవి తప్పుడు ఆరోపణలు అని, ఆమె కావాలనే టార్గెట్ చేస్తోందని, రాజ్ తరుణ్‌పై అవసరమైన కేసులు పెట్టిందని ఆర్జే శేఖర్ భాషా కూడా మీడియాలో తన అభిప్రాయాలు చెబుతున్నాడు.
చిన్న పిల్లలకు డ్రగ్స్
తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ లావణ్య, శేఖర్ భాషా మధ్య డిబేట్ నిర్వహించింది. ఈ డిబెట్‌లో లావణ్య వర్సెస్ శేఖర్ భాషా వివాదం హద్దులు దాటింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ సమయంలోనే లావణ్యపై శేఖర్ భాషా సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్య చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని, బలవంతంగా వారు డ్రగ్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తోందని శేఖర్ భాషా ఆరోపించాడు.
పర్సనల్ వీడియోలు బయటపెడతా
“చిన్నపిల్లలు, 21 ఏళ్లు ఉన్న అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తోంది. ఇది చీటింగ్ కంటే పెద్ద నేరం. నిన్న రాత్రి వాళ్లకు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం. ప్రీతి అనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె పర్సనల్ వీడియోలు పెట్టడం. తన గురించి మాట్లాడితే వీటిని అందరిముందు రిలీజ్ చేస్తానని బెదిరించింది. చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోంది. అది ఎంత పెద్ద నేరం” అని శేఖర్ భాషా లైవ్‌లో చెప్పాడు.
చెప్పుతో కొట్టిన లావణ్య
అలా చెబుతుండగానే కోపంతో శేఖర్ భాషాను తన కాలి చెప్పి తీసి కొట్టింది లావణ్య. దాంతో యాంకర్‌తోపాటు అక్కడున్న మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. లావణ్యను ఆపే ప్రయత్నం చేశారు. నన్ను చెప్పుతో కొడతావా.. దా కొట్టు.. కొట్టు అంటూ లావణ్యపైకి ఆవేశంగా వెళ్లాడు శేఖర్ భాషా. అక్కడున్న వాళ్లు మాత్రం మ్యాన్ హ్యండ్లింగ్ వద్దంటూ ఇద్దరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
లావణ్య ఆధీనంలో ఫేక్ అకౌంట్
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తర్వాత శేఖర్ భాషా చెప్పిన విక్టిమ్ ప్రీతి లవర్ వివేక్‌తో ఆర్జే భాషా ఫోన్‌లో మాట్లాడాడు. శేఖర్ భాషా చెప్పింది నిజమేనని, రాత్రి నుంచి ఓ అకౌంట్ నుంచి బెదిరింపులు వచ్చాయని, తర్వాత ఆ అకౌంట్ డియాక్టివేట్ అయిందని, లావణ్యతో మధ్యాహ్నాం మాట్లాడాకా మళ్లీ ఆ అకౌంట్ యాక్టివేట్ అయిందని వివేక్ ఫోన్‌లో చెప్పాడు.
మీడియా మీద నమ్మకం లేదు
వివేక్ చెబుతుంటే లావణ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. నాకు మీడియా మీద నమ్మకం లేదంటూ ఆరోపించింది. దీనికి సంబంధించిన లైవ్ ఆగస్ట్ 1న వైరల్ అయింది. ఇదిలా ఉంటే, మరోవైపు లావణ్య ఫిర్యాదుతో ముందస్తు బెయిల్ కోసం రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.