Best Web Hosting Provider In India 2024
International Female Orgasm day: ప్రతి ఏడాది ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఫిమేల్ ఆర్గాజమ్ డే’ నిర్వహించుకుంటారు. అంటే స్త్రీలో భావప్రాప్తి ఎంత ముఖ్యమో తెలిపేందుకు ఒక ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించారు. లైంగిక ప్రక్రియ అనేది కేవలం మగవారికి మాత్రమే చెందినది కాదు, ఇది ఆడవారి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. స్త్రీలలో భావప్రాప్తి కలగడం, లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల వారిలో ఎన్నో ఆరోగ్య మార్పులు సంభవిస్తాయి.
అంతర్జాతీయ స్త్రీ భావప్రాప్తి దినోత్సవం… దీన్ని తొలిసారి 2006లో ప్రారంభించారు. బ్రెజిల్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఎస్పేరాంటినాలో తొలిసారి ఈ దినోత్సవం నిర్వహించుకున్నారు. అక్కడ పనిచేసే ఒక కౌన్సిలర్ తన భార్యకు లైంగిక ప్రక్రియపరంగా ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఇది అక్కడ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహిళల లైంగిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచే విధంగా ఈ దినోత్సవం మారింది. అంతేకాదు మహిళలు తమ శరీరానికి లైంగిక ప్రక్రియ ఎంత అవసరమో కూడా అక్కడ తెలుసుకున్నారు.
ప్రత్యేక దినోత్సవం గురించి తెలుసుకున్నాక అనేక దేశాలు దీనికి మద్దతు తెలిపాయి. ఇప్పుడు ప్రజల్లో ఈ ప్రత్యేక దినోత్సవానికి సెలవును ప్రకటిస్తారు. ఎన్నో అధ్యయనాల ప్రకారం 58 శాతం మంది మహిళలు నిజమైన భావప్రాప్తికి గురికావడం లేదు, కేవలం తమ భర్త సంతోషం కోసం భావప్రాప్తి పొందుతున్నట్టు నటిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వారి లైంగిక ఆరోగ్యం కోసం ఇలాంటి ఒక ప్రత్యేక దినోత్సవం ప్రారంభమైంది.
తరచూ మహిళలు లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ వివరిస్తున్నాం.
బలమైన రోగనిరోధక వ్యవస్థ
తన జీవిత భాగస్వామితో శృంగార సంబంధాన్ని తరచూ పెట్టుకునే మహిళల రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉంటుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు అయినా వారు తమ భాగస్వామితో లైంగిక అనుబంధాన్ని కొనసాగించాలి. అరుదుగా సెక్స్ చేసే వ్యక్తులతో పోలిస్తే… తరచూ సెక్స్ చేసే వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ ఎంతో బలంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.
మంచి నిద్ర
ఆరోగ్యకరమైన లైంగిక జీవితం వల్ల మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యలు రావు. శరీరం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది జీవిత భాగస్వామితో ప్రేమ, సాన్నిహిత్యాన్నిపెంచుతుంది. వారిలో ఎండార్పిన్లు విడుదలవుతాయి. దీనివల్ల ఇద్దరూ హాయిగా నిద్రపోతారు.
మానసిక ఆరోగ్యం
ఒక వ్యక్తికి కీలకమైన మానసిక, భావోద్వేగ ప్రయోజనాలు అందించడంలో లైంగిక క్రియ ముందుంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఆనందాన్ని పెంచుతుంది.
గుండె ఆరోగ్యం
గుండెపోటు వచ్చి అవకాశాన్ని తగ్గించడంలో లైంగిక జీవితం చాలా ముఖ్యమైనది. లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. సెక్స్ చేసే సమయంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇవి హృదయ స్పందన రేటును కాపాడతాయి.
మూత్ర వ్యవస్థ
మహిళల్లో మూత్రాశయ నియంత్రణ మీద వయసు పెరుగుతున్న కొద్ది పట్టుకోల్పోతారు. ఇలా కోల్పోకుండా ఉండాలంటే వారు తరచూ లైంగిక ప్రక్రియలో పాల్గొనాలి. బలమైన కటి కండరాలను మీరు కలిగి ఉంటారు. మూత్రాశయ నియంత్రణకు లైంగిక చర్యలు చర్య అనేది ఒక వ్యాయామంగా భావించాలి.