Best Web Hosting Provider In India 2024
Crime Thriller OTT: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా నటించిన తెప్ప సముద్రం మూవీ ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్‌లో తెప్ప సముద్రం మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ తెలుగు మూవీలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించింది. పి.రవి శంకర్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాకు సతీష్ రాపోలు దర్శకత్వం వహించాడు.
సైకో కిల్లర్ కథతో…
సైకో కిల్లర్ కథతో దర్శకుడు తెప్ప సముద్రం మూవీని తెరకెక్కించాడు. తెప్ప సముద్రం అనే ఊరిలో స్కూల్ పిల్లలు వరుసగా మిస్సవుతుంటారు. మిస్సింగ్ కేసులోని నిజాలను వెలికితీసే ప్రయత్నంలో ఎస్ఐ గణేష్‌తో (చైతన్యరావు) పాటు జర్నలిస్ట్ ఇందు (కిషోర్ ధాత్రిక్) ఉంటారు.
అనుకోకుండా ఈ కేసులో ఇందును ప్రేమిస్తోన్న ఆటో డ్రైవర్ విజయ్ (అర్జున్ అంబటి)అరెస్ట్ అవుతాడు? ఈ కేసుకు విజయ్‌కి ఉన్న సంబంధం ఏమిటి? గణేష్ వెతుకుతున్న సైకో కిల్లర్ ఎవరు? ఈ క్రైమ్‌లోకి గణేష్ తండ్రి లాయర్ విశ్వనాథ్ (పి.రవిశంకర్) ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నదే తెప్ప సముద్రం మూవీ కథ. క్రైమ్ అంశాలకు ఓ చిన్న మెసేజ్‌ను జోడించి ఈ మూవీ రూపొందింది. సెకండాఫ్‌లోని ట్విస్ట్‌లను డైరెక్టర్ బాగా రాసుకున్నాడనే ప్రశంసలు కనిపించాయి. మాస్ రోల్లో అర్జున్ అంబటి యాక్టింగ్ బాగుందంటూ ఆడియెన్స్ పేర్కొన్నారు. ఈ మూవీకి పెద్దపల్లి రోహిత్ మ్యూజిక్ అందించాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్…
సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోన్నారు అర్జున్ అంబటి, చైతన్యరావు. బిగ్‌బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా అర్జున్ అంబటి పాల్గొన్నాడు. ఫైనల్ చేరుకున్న అతడు ఐదో రన్నరప్‌గా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీరియస్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అర్జున్ అంబటి దేవత, అగ్నిసాక్షితో బుల్లితెర ఫ్యాన్స్‌కు చేరువయ్యాడు.
లౌక్యం, తీస్మాస్ ఖాన్‌తో పాటు పలు తెలుగుసినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. తెప్ప సముద్రంతో పాటు సుందరి వంటి సినిమాల్లో హీరోగా కనిపించాడు. తెలుగులో అగ్నిసాక్షి, పరంపరతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లలో కనిపించాడు. ప్రస్తుతం సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నాడు.
నాలుగు సినిమాలు…
మరోవైపు 30 వెడ్స్ 21 కామెడీ వెబ్‌సిరీస్‌తో పాపులర్ అయిన చైతన్యరావు చిన్న సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలు చేశాడు. పారిజాత పర్వం, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, తెప్ప సముద్రంతో పాటు మరో సినిమాలో హీరోగా కనిపించాడు.