Friendship day 2024: మీ బెస్ట్‌ఫ్రెండ్‌తో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇదిగో ఐడియాలు

Best Web Hosting Provider In India 2024

మన కుటుంబాన్ని మనం ఎంచుకోలేం. కానీ స్నేహితులను మాత్రం మనం ఎంచుకోగలం. అపరిచితులుగా మొదలైన పరిచయం తరువాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. ఎంతో మందికి స్నేహితులే ప్రాణం. వారి అండతోనే జీవించే వారు కూడా ఉన్నారు. అందుకే స్నేహబంధానికి ప్రపంచంలో ఎంతో విలువ ఉంది. స్నేహంలో నచ్చిన ఆహారం తినడం, కలిసి నవ్వుకోవడం, గాసిప్స్ మాట్లాడుకోవడం… ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకోవడం అనేవి ఇద్దరు బెస్ట్ స్నేహితుల మధ్య ఉంటుంది. అది మరిచిపోలేని బంధంగా మారుతుంది.

 

ప్రేమ, ఆప్యాయతతో నిండిన స్నేహితులు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇద్దరు స్నేహితుల మధ్య చిలిపి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఏడిస్తే ఓదార్చే చేయి అందించేది స్నేహితులే. ఓడిపోతే ధైర్యంగా ఉండమని భుజం తట్టే స్నేహితుడు, గెలిచినప్పుడు ఆనందంతో బిగ్గరగా అరిచి సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఉత్తమ స్నేహితులు లేని మన జీవితాన్ని మనం ఊహించలేము. ఇప్పుడు స్నేహితులే లేని జీవితాన్ని ఊహించడమే కష్టం.

ఫ్రెండ్స్ అంటే మన జీవితాలను సులువుగా మార్చేవారు, మన నవ్వులను రెట్టింపు చేసేవారు, మన బాధలను పంచుకునేవారు… అందుకే స్నేహితుల కోసం ఫ్రెండ్షిప్ డే వచ్చింది. మీ అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఇక్కడ కొన్ని ఐడియాలు ఇచ్చాము. స్నేహితుల దినోత్సవం ఆదివారమే వస్తుంది కాబట్టి, మీరు స్నేహితులతో రోజంతా గడపవచ్చు.

రోడ్ ట్రిప్

మీ బెస్ట్ ఫ్రెండ్స్ కారును బుక్ చేసుకుని నచ్చిన ఆహారాన్ని ప్యాక్ చేసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లింది. నేషనల్ హైవేలపై రోడ్ ట్రిప్ కు వెళితే గాలి ముఖానికి తాకుతూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీకు ఇష్టమైన పాటలు వింటూ మీ స్నేహితులతో ఆనందంగా గడపవచ్చు.

 

రిసార్ట్ లో ఎంజాయ్

ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్ ను బుక్ చేసుకుని పది మంది స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఎన్నో గేమ్స్ ఆడడం, నచ్చిన ఆహారాన్ని కలిసి ఎంజాయ్ చేయడం, ఫోటోలు తీసుకోవడం ఇలా మీకు నచ్చిన విధంగా స్నేహితులతో సెలెబ్రేట్ చేసుకోవచ్చు.

జూమ్ కాల్ లో

చిన్ననాటి స్నేహితులు అంతా ఒక్కచోట ఉండకపోవచ్చు. వారు ఒక్కోచోట ఉండవచ్చు. కొంతమంది విదేశాల్లో కూడా ఉంటారు. అలాంటి వారంతా జూమ్ మీటింగ్ లో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. మీరు భౌతికంగా దూరంగా ఉన్నా మీ మనసులు ఒక చోట చేరడానికి జూమ్ మీటింగ్ చాలు. ఉత్తమ స్నేహం మైళ్ల దూరంలో ఉన్నా కూడా వారి బంధం ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుంది.

పెయింటింగ్ క్లాసులు

మీరు, మీ బెస్ట్ కలిసి సృజనాత్మకంగా ఫ్రెండ్షిప్ డే నిర్వహించుకోవచ్చు. ఇద్దరూ కలిసి నచ్చిన పని చేయండి. పెయింటింగ్ చేయడం, నచ్చినవి వండుకోవడం, షాపింగ్ కు వెళ్లడం వంటివి చేయండి.

పిక్నిక్

మీరు, మీ ఫ్రెండ్ కలిసి లంచ్ ప్యాక్ చేసుకుని ఏదైనా పార్కులో పిక్నిక్ ప్లాన్ చేయండి. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కాలేజీ జ్ఞాపకాలను నెమరువేసుకోండి. ఒక రోజంతా పార్కులో తిరుగుతూ ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేయండి.

 

కాఫీ డేట్

మీ బెస్ట్ మేట్ ని కాఫీ డేట్‌కు తీసుకెళ్లండి. వారికి బహుమతులు ఇవ్వండి, లేఖలు రాయండి. గ్రీటింగ్ కార్డులు పంపండి. వారు మీకు ఎంత ముఖ్యమో వారికి తెలియజేయడానికి ప్రయత్నించండి.

WhatsApp channel
 

టాపిక్

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024