CAG Report:జీఎస్టీ చెల్లింపులపై కాగ్ రిపోర్ట్, లెక్కతేలని రూ.986 కోట్లు-నివేదికలో కల్యాణ్ రామ్,లలితా జ్యువెలర్స్ పేర్లు

Best Web Hosting Provider In India 2024

CAG Report On GST : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్, పన్ను చెల్లింపులలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా 2021-22 రెవెన్యూ సెక్టర్ పై కాగ్ నివేదికను ప్రభుత్వం నిన్న శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణలో రూ.986 కోట్ల ఆదాయంపై స్పష్టత లేదని కాగ్ నివేదికలో పేర్కొంది. GST చెల్లింపులలో భారీ అవకతవకలు, రాబడుల మధ్య వ్యత్యాసాలు, అదనపు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్(ITC), వడ్డీ చెల్లించకపోవడం… ఇలాంటి అనేక ఇతర ఉల్లంఘనలను కాగ్ సంస్థ గుర్తించింది. హైదరాబాద్ రేస్ క్లబ్, మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్, బీడీఎల్, లలితా జ్యువెలర్స్, హీరో కల్యాణ్ పేర్లను కాగ్ తన నివేదికలో పేర్కొంది.

 

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పన్నుల చెల్లింపుల అవకతవకలపై ఆరా తీస్తుంది. 283 సంస్థలు, వ్యక్తుల పన్నుల చెల్లింపులలో వ్యత్యాసాలను గుర్తించింది. 97 కేసుల్లో ఆడిట్ చేయాలని నిర్ణయించింది. పంజాగుట్ట డివిజన్‌లోని షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో రూ. 17 కోట్ల జీఎస్టీ రిటర్న్స్‌లో ఇన్ పుడ్ ట్యాక్స్ సరిపోలలేదు. దీనిపై పన్ను చెల్లింపుదారులకు నోటీసు జారీ చేసినట్లు పన్నుల శాఖ తెలిపింది. బేగంపేట డివిజన్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ విషయంలో రూ.11 కోట్ల రిటర్న్స్‌లు, బయోకాన్ లిమిటెడ్ విషయంలో ఐటీసీ రూ.9 కోట్లు సరిపోలేదని తెలిపింది. డేటా ఎంట్రీ తప్పుల వల్ల 41 కేసుల్లో (14.49%), 101 కేసుల్లో (35.69%) వ్యత్యాసాలు కారణమైతే, డిపార్ట్‌మెంట్ ఇప్పటికే చర్యలు చేపట్టి సరైన వివరణలు ఇచ్చిందని కాగ్ తెలిపింది.

లలితా జ్యువెలర్స్ ఐటీసీలో రూ.53.52 లక్షల రివర్స్ ల్స్ బ్యాలెన్స్

రూ.15.39 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను లలితా జ్యువెలర్స్ క్లెయిమ్ చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇందులో రూ.14.85 కోట్లు తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.53 లక్షలు ఏమయ్యాయని కాగ్ ఆరా తీస్తుంది. 2017-18 సంవత్సరానికి జీఎస్టీఆర్ ప్రకారం పంజాగుట్టలోని లలితా జ్యువెలరీ రూ.56.61 కోట్ల ఐటీసీని పొందిందని కాగ్ నివేదికలో పేర్కొంది. జీఎస్టీఆర్ అందుబాటులో ఉన్న ఐటీసీ కేవలం రూ.41.22 కోట్లు మాత్రమే, అయితే రూ.15.39 కోట్లు అదనపు క్లెయిమ్ వచ్చింది. దీనిని గుర్తించిన పన్నుల శాఖ ఆడిట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పన్ను చెల్లింపుదారు రూ.15.39 కోట్ల అదనపు క్లెయిమ్‌లో రూ.14.85 కోట్లను తిరిగి చెల్లించారు. రూ.53.52 లక్షల మేర రివర్సల్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు నిరూపించే పత్రాలు ఆడిట్ కోసం అందించలేదని తెలుస్తోంది.

 

వడ్డీ చెల్లించని కళ్యాణ్ రామ్?

టాలీవుడ్ హీరో కళ్యాణ్‌ రామ్ ఐటీ రిటర్న్‌లు ఆలస్యంగా దాఖలు చేశారు. అయితే ఆలస్యం అయినందుకు వడ్డీ చెల్లించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికలో కళ్యాణ్‌ రామ్ జూలై 2017 నుంచి అక్టోబర్ 2017 వరకు, ఫిబ్రవరి 2018 నుంచి మార్చి 2018 వరకు ఐటీ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేశారు. ఈ రిటర్న్‌లలో పన్ను బకాయిలు చెల్లించినా… ఆలస్యం అయినందుకు వడ్డీ రూ.11.53 లక్షలు చెల్లించలేదు. దీనిని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనిపై కళ్యాణ్ రామ్ కు సమాచారం అందిస్తామని పన్నుల శాఖ తెలిపింది.

 

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
Telangana NewsHyderabadGstCag ReportsTrending TelanganaTelugu News
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024