Best Web Hosting Provider In India 2024

మీడియా సమావేశంలో వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్
ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల హంగామా
ఫోటోలకే పరిమితం. బాధితులకు అందని సాయం
సీఎం చంద్రబాబు కనీసం ఏరియల్ సర్వే చేయలేదు
నాడు వరదల సమయంలో బాధితులకు మా అండ
వేగంగా స్పందించిన అప్పటి సీఎం వైయస్ జగన్
బాధితులకు తక్షణమే రేషన్. పరిహారం అందజేత
కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వ తీరు అతి దారుణం
గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది
అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం చాలా ఉంది
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి బాధితులను ఆదుకోవాలి
ముంపు ప్రాంతాల్లో రాకపోకలు పునరుద్ధరించాలి
ఇప్పుడు వాలంటీర్లు ఉంటే సత్వర సేవలందేవి
టీడీపీ కూటమి ప్రభుత్వం వారినీ దగా చేసింది
సూపర్‌సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా మంగళం
మరోసారి ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు
రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దోపిడి. తరలింపు
ఇసుక ఫ్రీగా ఇస్తున్నామంటూ ప్రభుత్వం ఆర్భాటం
కానీ, గతంలో కంటే ఎక్కువ ధరకు విక్రయం
టీడీపీ కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్
రాజమండ్రి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నా, సహాయక చర్యల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొన్ని చోట్ల పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులకు సాయం చేయకుండా కేవలం ఫోటోలకే పరిమితమయ్యారని, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. అదే గతంలో తమ ప్రభుత్వ హయాంలో గోదావరి వరదలు పోటెత్తి.. ముంపునకు గురైన కూనవరం, దేవీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టందని, బాధితులను ఆదుకోవడంలో నాటి సీఎం వైయస్ జగన్ వేగంగా స్పందించారని ఆయన గుర్తు చేశారు. బాధితులకు రేషన్‌తో పాటు, పరిహారం కూడా సకాలంలో అందించారని చెప్పారు. రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో మార్గాని భరత్ శనివారం మీడియాతో మాట్లాడారు.
గతంలో ప్రతి సోమవారం పోలవరం అన్న అప్పటి సీఎం చంద్రబాబు, ఇప్పుడు పదవిలో ఉన్నా.. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మార్గాని భరత్ ఆక్షేపించారు. సీఎం కనీస ఏరియల్ సర్వే కూడా చేయలేదని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో గోదావరిలో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తినా, ఆ స్థాయిలో వరద ఉన్నా, తాము బా«ధితులను ఆదుకున్నామని, కానీ ఇప్పుడు 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, ఈ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం లేదని ఆక్షేపించారు.
గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గుతున్నందువల్ల, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ హెచ్చరించారు. అందుకే అధికారులు వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని, ముంపు గ్రామాల్లో వెంటనే రాకపోకలు పునరుద్ధరించాలని కోరారు. ఈ సమయంలో వలంటీర్లు ఉంటే.. బాధితులకు సత్వర సేవలందేవన్న ఆయన, టీడీపీ కూటమి ప్రభుత్వం వారినీ దగా చేసిందని ప్రస్తావించారు.
ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు ఒక్కొక్కటిగా ప్రభుత్వం మంగళం పాడుతోందని మార్గాని భరత్ తెలిపారు. తల్లికి వందనం లేదని, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని, ఏటా మూడు ఉచిత సిలిండర్లూ లేవని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే, టీడీపీ కూటమి నేతలు, నాయకులు ఎక్కడికక్కడ ‘ఇసుకాసురులు’గా మారారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. వర్షాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడికక్కడ ఇసుక నిల్వ చేస్తే.. ఆ డంప్‌ల నుంచి 40 లక్షల టన్నులకు పైగా ఇసుక మాయం చేశారని తెలిపారు. అలా వారు దాదాపు రూ.10 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఇసుక ఫ్రీ అంటూ, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. నిజానికి తమ ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తోందని చెప్పారు.
ఇంకా, చాలా చోట్ల పేకాట క్లబ్బుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టర్లను అడుగుతున్నారన్న మార్గాని భరత్, అంత కంటే సిగుగ చేటు మరోటి లేదని వ్యాఖ్యానించారు.
రాజమండ్రిలో స్ధానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రతి వ్యాపారి ఇంటికి వెళ్లి చిట్టీల్లో చేరమని ఒత్తిడి చేస్తున్నారన్న మాజీ ఎంపీ, ప్రజలు ఓట్లేసి గెలిపించింది, చిట్టీల వ్యాపారం చేసుకోవడానికా? అని నిలదీశారు.