Best Web Hosting Provider In India 2024
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‍గణ్ ఈ ఏడాది సైతాన్ సినిమాతో మంచి హిట్ కొట్టారు. మళ్లీ సక్సెస్ ట్రాక్‍లోకి వచ్చారు. మైదాన్ కమర్షియల్‍గా నిరాశపరిచినా.. ప్రశంసలు దక్కించుకుంది. అజయ్ దేవ్‍గణ్, టబు హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఔరో మే కహా దమ్ థా’ ఈ శుక్రవారం (ఆగస్టు 2) థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు మొదటి నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. అసలే పెద్దగా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగలేదు. అందులోనూ మౌత్ టాక్ సరిగా లేకపోయే సరికి ఈ మూవీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘ఔరో మే కహా దమ్ థా’ చిత్రానికి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి.
15ఏళ్లలో ఇదే తక్కువ ఓపెనింగ్
ఔరో మే కహా దమ్ థా మూవీకి తొలి రోజు సుమారు రూ.2కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఆల్ ది బెస్ట్ (2009) సినిమా తర్వాత అజయ్ దేవ్‍గణ్‍కు 15 ఏళ్లలో ఇదే తక్కువ ఓపెనింగ్. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
అజయ్ దేవ్‍గణ్ నుంచి ఈ ఏడాది వచ్చిన సైతాన్ తొలి రోజు రూ.15.21 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంటే.. మైదాన్ రూ.7.25 కోట్లను రాబట్టింది. ఈ రెండు చిత్రాలకు మోస్తరు ఓపెనింగ్ దక్కింది. అయితే, ఇప్పుడు ఔరో మే కహా దమ్ థా తొలి రోజు ఇంత తక్కువ కలెక్షన్లు రావడం ట్రేడ్ నిపుణులను కూడా షాక్‍కు గురిచేసింది.
ఔట్‍డేటెడ్ అంటూ..
ఔరో మే కహా దమ్ థా సినిమాకు టాక్‍తో పాటు రివ్యూలు కూడా నెగెటివ్‍గానే వచ్చాయి. ముఖ్యంగా రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చాలా ఔడేటెడ్‍గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా.. సాగదీతగా సాగిందనే టాక్ వచ్చింది. దీంతో తొలి రోజే ఈ చిత్రం దారుణమైన వసూళ్లు తెచ్చుకుంది. వీకెండ్‍లోనూ ఈ మూవీ పుంజుకోవడం కష్టంగానే అనిపిస్తోంది.
ఔరో మే కహా దమ్ థా సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. రెండు దశాబ్దాల మధ్య సాగే ప్రేమ కథతో తెరకెక్కించారు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‍గణ్, టబూతో పాటు సయీ షాయాజీ షిండే, జయ్ ఉపాధ్యాయ్, హార్దిక్ సోనీ, సయీ మంజ్రేకర్, షారూఖ్ షాద్రి కీలకపాత్రలు పోషించారు.
ఔరో మే కహా దమ్ థా మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, పనోరమ స్టూడియోస్, ఎన్‍హెచ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఉలఝ్ సినిమాకు తక్కువే..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ సినిమా ‘ఉలఝ్’ ఆగస్టు 2నే రిలీజ్ అయింది. ఈ సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం తొలి రోజున రూ.1.37 కోట్ల కలెక్షన్లు మాత్రం దక్కించుకోగలిగింది. ఈ సినిమాకు కూడా అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ ఓపెనింగ్ దక్కించుకుంది. ఉలఝ్ మూవీకి సుధాన్షు సారియా దర్శకత్వం వహించగా.. జంగ్లీ పిక్చర్స్ నిర్మించింది. మరి ఈ మూవీ వీకెండ్‍లో ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits