Crime Thriller OTT Series: త్రిష ఓటీటీ ఎంట్రీ సూపర్ సక్సెస్.. పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళుతున్న వెబ్ సిరీస్

Best Web Hosting Provider In India 2024

దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో సుమారు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‍గా వెలుగొందుతున్నారు త్రిష. ఇప్పటికీ వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఓటీటీ ప్రాజెక్టులోకి త్రిష అడుగుపెట్టారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృంద’ ఆగస్టు 2వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. త్రిష చేసిన ఫస్ట్ సిరీస్ కావడంతో ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ వెబ్ సిరీస్‍కు పాజిటివ్ టాక్ వస్తోంది. త్రిష ఓటీటీ ఎంట్రీ సక్సెస్ అయింది. వివరాలివే..

 

పాజిటివ్ రెస్పాన్స్

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన బృంద వెబ్ సిరీస్ ఆగస్టు 2న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్‍కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు.

బృంద సిరీస్‍ను సోనీలివ్ ఓటీటీలో చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‍పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సిరీస్‍ కథ, కథనం ఆసక్తికరంగా, ఎంగేజింగ్‍గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు మనోజ్ ఈ కథను చాలా థ్రిల్లింగ్‍గా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని నెటిజన్లు అంటున్నారు. స్క్రీన్‍ప్లే కూడా బాగుందనే టాక్ వస్తోంది.

త్రిష పర్ఫార్మెన్స్‌పై..

బృంద సిరీస్‍లో సబ్ ఇన్‍స్పెక్టర్‌గా త్రిష నటించారు. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఆమె యాక్టింగ్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా అనిపించింది. ఈ సిరీస్‍లో త్రిష అద్బుతంగా పర్ఫార్మ్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాత్రకు ఆమె సరిగ్గా సూటయ్యారని, కథకు చాలా ప్లస్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్రిష నటనపై ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. రవీంద్ర విజయ్ నటనకు కూడా ఫుల్ మార్క్స్ పడుతున్నాయి.

 

బృంద సిరీస్‍లో త్రిష, రవీంద్ర విజయ్‍తో పాటు ఇంద్రజిత్ సుకుమార్, జయ ప్రకాశ్, ఆమని, ఆనంద్ సామి, రాఖేందు మౌళి కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు సూర్య మనోజ్ వంగల డైరెక్ట్ చేయగా శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. యాడింగ్ అడ్వర్టైజింగ్ ఎల్ఎల్‍పీ బ్యానర్‌పై ఆశిష్ కొల్ల ఈ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేశారు. దినేశ్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు.

బృంద స్టోరీలైన్

ఎస్ఐ బృంద (త్రిష) పని చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చెరువులో ఓ మృతదేహం లభ్యమవుతుంది. ముందుగా దీన్ని ఆత్మహత్య అనుకుంటారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేసి ఇది హత్య అని బృంద కనుగొంటారు. ఇది ఒక్కటే కాదని మరిన్ని హత్యలు జరిగాయని ఆ తర్వాత జరిపే విచారణలో బృంద తెలుసుకుంటారు. హంతకులు ఎవరు.. వారి ఉద్దేశం ఏంటని బృంద తన టీమ్‍తో దర్యాప్తు చేస్తుంది. అయితే చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఉన్నతాధికారులు కేసు క్లోజ్ చేయాలని చెప్పినా ఆమె నిరాకరిస్తుంది. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేశారు? బృంద ఆ కిల్లర్‌ను పట్టుకుందా? ఈ కేసును ఆమె ఎందుకు అంత పట్టుదలగా తీసుకుంటారు? అనేది బృంద సిరీస్‍ కథలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024