Best Web Hosting Provider In India 2024

Paris Olympics: బ్యాడ్మింటన్‌లో ఈ సారి ఇండియా కనీసం రెండు ఒలింపిక్ మెడల్స్ అయిన సాధిస్తుందని అభిమానులు ఆశించారు. పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి-సాత్విక్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ క్వార్టర్స్‌లోనే పీవీ సింధుతో పాటు చిరాగ్, సాత్విక్ జోడీ వెనుదిరిగారు.
ప్రి క్వార్టర్స్‌లో చైనాకు చెందిన హే బిన్‌జియావో చేతిలో సింధు ఓటమి పాలైంది. 19-21, 14-21 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన సింధు సెకండ్ పూర్తిగా తేలిపోయింది. గత ఒలింపిక్స్‌లో సింధు చేతిలో ఎదురైన పరాభవానికి హే బిన్‌జియావో ప్రతీకారం తీర్చుకుంది. సాత్విక్ – చిరాగ్ జోడి డబుల్స్ క్వార్టర్స్‌లో పోరాడి ఓడిపోయారు. బ్యాడ్మింటన్‌లో కేవలం లక్ష్మసేన్ ఒక్కటే ఒలింపిక్స్‌లో మిగిలి ఉన్నాడు. మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన ప్రణయ్‌పై లక్ష్యసేన్ విజయం సాధించాడు. నేడు క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చో చెన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
హ్యాట్రిక్ మెడల్‌పై గురి…
ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచి చరిత్రను సృష్టించింది మను భాకర్. మూడో మెడల్‌పై గురిపెట్టింది. ఉమెన్స్ 25 మీటర్స్ టీమ్ క్వాలిఫయర్ రైండ్ పోటీలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ ఈవెంట్లో ఈషాసింగ్తో కలిసి మను భాకర్ బరిలో దిగుతోంది.
గోల్ఫ్ సెకండ్ రౌండ్ పోటీలు – శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్
షాట్‌పుట్ క్వాలిఫికేషన్ రౌండ్ పోటీలు – తుజిందర్ పాల్
ఉమెన్స్ 5000 మీటర్ల హీట్ పోటీలు -అంకిత, పారుల్
ఆర్చరీ మిక్స్డ్ టీమ్ – ధీరజ్ అంకిత
జూడో ఉమెన్స్ 78 కేజీల విభాగం – తులిక సింగ్
హాకీ – భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్
మూడు షూటింగ్‌లోనే…
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా ఇప్పటివరకు మూడు కాంస్య పతకాలు సాధించింది. ఈ మూడు మెడల్స్ షూటింగ్‌లోనే రావడం గమనార్హం. ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ పతకం సాధించింది. టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి పతకం గెలిచింది. షూటింగ్ లో స్విప్నిల్ కుషాలే కూడా బ్రాండ్ మెడల్ గెలిచాడు.