Swapnil Kusale Medal: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు మరో మెడల్.. మూడోది కూడా షూటింగ్‌లోనే.. స్వప్నిల్ కుశాలెకు బ్రాంజ్

Best Web Hosting Provider In India 2024


Swapnil Kusale Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియా మూడో బ్రాంజ్ మెడల్ గెలిచింది. షూటర్ స్వప్నిల్ కుశాలె షూటింగ్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి మెడల్ గెలిచాడు. ఈ ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన మూడు మెడల్స్ కూడా షూటింగ్ లోనే రావడం విశేషం.

స్వాప్నిల్ కుశాలె చరిత్ర

ఒలింపిక్స్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్ చేరిన తొలి ఇండియన్ గా నిలిచిన స్వప్నిల్ కుశాలె.. ఇప్పుడు ఏకంగా బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. గురువారం (ఆగస్ట్ 1) జరిగిన ఫైనల్లో కుశాలె 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలిచాడు. చైనా, ఉక్రెయిన్ షూటర్లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి.

 

పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకూ ఇండియాకు మూడు మెడల్స్ రాగా.. అన్నీ షూటింగ్ లోనే కావడం విశేషం. మొదట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత అదే మను బాకర్ 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్ సింగ్ తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది.

 

స్వప్నిల్ రికార్డు

ఇక ఇప్పుడు స్వప్నిల్ కుశాలె తొలిసారి ఒలింపిక్స్ లో ఇండియాకు 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ లో మెడల్ అందించడం విశేషం. అసలు ఫైనల్ చేరినప్పుడే చరిత్ర సృష్టించిన కుశాలె.. మెడల్ తో మరోసారి ఆ చరిత్రను తిరగరాశాడు. ఫైనల్లో స్వప్నిల్ తొలి రెండు పొజిషన్లు నీలింగ్, ప్రోన్ ముగిసే సమయానికి 5వ స్థానంలో నిలిచాడు. చాలా వరకు ఈవెంట్లో అదే స్థానానికి పరిమితమయ్యాడు.

 

అయితే స్టాండింగ్ పొజిషన్ కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. స్వప్నిల్ మెల్లగా మొదట నాలుగో స్థానానికి, తర్వాత మూడో స్థానానికి చేరి మెడల్ గెలిచాడు. మొత్తంగా 44 షాట్ల తర్వాత స్వప్నిల్ 451.4 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలిచాడు.

 

మెరుస్తున్న షూటర్లు..

పారిస్ ఒలింపిక్స్ లో మొత్తంగా 117 మంది ఇండియన్ అథ్లెట్లు పాల్గొనగా.. అందులో అత్యధికంగా 21 మంది షూటర్లు ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లో మూడు మెడల్స్ రావడం విశేషం. ఇప్పటి వరకూ ఒక ఒలింపిక్స్ లో షూటింగ్ నుంచి మూడు మెడల్స్ రావడం ఇదే తొలిసారి. అందులో మను బాకర్ రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

 

ఇప్పుడు స్వప్నిల్ కూడా అంతే. అసలు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో ఓ ఇండియన్ ఫైనల్ చేరడమే తొలిసారి అనుకుంటే.. అతడు ఏకంగా మెడల్ గెలిచాడు. తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ సాధించడం మామూలు విషయం కాదు.

 

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source link