Best Web Hosting Provider In India 2024
Paris Olympics: ఒలింపిక్స్ ఆరో రోజు మరో భారత షూటర్ పతకంపై ఆశలు రేపుతోన్నాడు. మెన్స్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలే ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫయర్ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. నేడు (గురువారం) ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. తప్పకుండా మెడల్ సాధించాలని అభిమానులు కోరుకుంటోన్నారు.
గురువారం షూటింగ్‌తో పాటు హాకీ, బాక్సింగ్‌తో పాటు పలు ఈవెంట్స్‌లో కీలకమైన మ్యాచ్‌లు జరుగనున్నాయి. నేటి నుంచి అథ్లెటిక్స్ పోటీలు మొదలుకానున్నాయి. లాంగ్ వాక్‌తో పాటు మరికొన్ని ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్పి పరీక్షించుకోబోతున్నారు.
హాకీ..
హాకీలో రెండు విజయాలతో, ఓ డ్రాతో జోరు మీదున్న భారత జట్టు గురువారం బెల్జియంతో తలపడనుంది. మధ్యాహ్నం 1.30 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
ఆర్చరీ
ఆర్చరీ టీమ్ ఈవెంట్స్‌లో విఫలమైన దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో మాత్రం క్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టి పతకం ఖాయం చేయాలని దీపికా భావిస్తోంది. మెన్స్ రికర్వ్ విభాగంలో ప్రవీణ్ జాదవ్ మ్యాచ్ గురువారం జరుగనున్నది.
బాక్సింగ్…
తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్ గురువారం టాప్ ర్యాంకర్ చైనాకు చెందిన వు యుతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నిఖత్ ఈజీగా పతకం సాధించే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
బ్యాడ్మింటన్
మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో లక్ష్యసేన్, పీవీ సింధు మ్యాచ్‌లు నేడు హైలైట్‌గా నిలవబోతున్నాయి. మెన్స్ డబుల్స్ పోటీల షెడ్యూల్ (సాత్విక్ – చిరాగ్ శెట్టి) కూడా నేడు ఉంది.
అథ్లెటిక్స్…
మెన్స్ అండ్ ఉమెన్స్ ఇరవై కిలో మీటర్ల నడక పోటీలు ఫైనల్ – పరమ్‌జీత్, వికాస్, ఉమెన్స్ – ప్రియాంక
సెయిలింగ్ – మెన్స్ విష్ణు – ఉమెన్స్ నేత్ర
గోల్ఫ్ – శుభాంఖర్ శర్మ, గగన్ జీత్ భుల్లర్