Film Fare Awards: ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ – బెస్ట్ హీరోగా నాని – బెస్ట్ మూవీగా బ‌ల‌గం – స‌లార్‌కు ఒక్క అవార్డు రాలేదు

Best Web Hosting Provider In India 2024

Film Fare Awards: ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్‌లో ద‌స‌రా మూవీకి గాను బెస్ట్ హీరోగా నాని అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డుల్లో ద‌స‌రా, బ‌లగం , బేబీ సినిమాలు స‌త్తాచాటాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 ప్ర‌దానోత్స‌వ వేడుక శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

 

బ‌లగం బెస్ట్ మూవీ…

ఫిల్మ్‌ ఫేర్ సౌత్ అవార్డుల్లో తెలుగులో అగ్ర హీరోల సినిమాల‌ను షాకిస్టూ బ‌ల‌గం బెస్ట్ మూవీగా అవార్డును ద‌క్కించుకున్న‌ది. బెస్ట్ ఫిల్మ్ నామినేష‌న్స్ లో ప్ర‌భాస్ స‌లార్‌, అనుష్క మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టితో పాటు ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ నిలిచాయి. భారీ బ‌డ్జెట్ మూవీస్‌ను కాద‌ని క‌థాబ‌ల‌మున్న మంచి మూవీగా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలిచిన బ‌ల‌గం మూవీ ఉత్త‌మ చిత్రంగా అవార్డును గెలుచుకున్న‌ది. బ‌లగం సినిమాకుగాను బెస్ట్ డైరెక్ట‌ర్‌గా వేణు టిల్లుకు ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారం ద‌క్కింది.

బ‌ల‌గంలో కీల‌క పాత్ర పోషించిన రూప‌ల‌క్ష్మి ఉత్తమ స‌హాయ‌న‌టిగా అవార్డును సొంతం చేసుకున్న‌ది. తెలంగాణ యాస భాష‌ల‌కు ప్రాధాన్య‌మిస్తూ కేవ‌లం కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన బ‌ల‌గం మూవీ 30 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి, కావ్య క‌ళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

ద‌స‌రాకే అన్ని అవార్డులు…

ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల్లో ద‌స‌రా మూవీ స‌త్తా చాటింది. హ‌య్యెస్ట్ అవార్డ్స్ గెలుచుకున్న మూవీగా నిలిచింది. ప‌లు విభాగాల్లో పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న‌ది. ద‌స‌రా సినిమాకుగాను బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ ల‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా స‌త్య‌న్ సూర‌న్‌తో పాటు ప్రొడ‌క్ష‌న్ డిజైన్ (అవినాష్ కొల్లా), కొరియోగ్ర‌ఫీ (ప్రేమ్ ర‌క్షిత్‌) విభాగాల్లో ద‌స‌రా మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డులు వ‌చ్చాయి.

 

చిన్న సినిమాగా రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన బేబీ మూవీ కూడా ఫిల్మ్ ఫేర్‌లో మెరిసింది. క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ మూవీగా బేబీకి అవార్డు వ‌చ్చింది. బెస్ట్ హీరోయిన్‌గా వైష్ణ‌వి చైత‌న్య (క్రిటిక్స్‌)తో పాటు బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ బుల్గానిన్‌, బెస్ట్ సింగ‌ర్ శ్రీరామ‌చంద్ర , ఉత్త‌మ గేయ ర‌చ‌యిత అనంత శ్రీరామ్ బేబీ సినిమాతో ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.

వాల్తేర్ వీర‌య్య ర‌వితేజ‌…

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడిగా ర‌వితేజ (వాల్లేర్ వీర‌య్య‌), బ్ర‌హ్మానందం (రంగ‌మార్తండ‌), బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్స్‌గా శ్రీకాంత్ ఓదెల (ద‌స‌రా), శౌర్యువ్‌(హాయ్ నాన్న‌)ల‌కు అవార్డులు వ‌చ్చాయి.

స‌లార్‌కు నిరాశ‌…

ప్ర‌భాస్ స‌లార్ మూవీకి ఒక్క అవార్డు రాలేదు. బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌తో పాలు ప‌లు విభాగాల్లో స‌లార్ నామినేట్ అయ్యింది. కానీ ఎందులో అవార్డును గెలుచుకోలేక‌పోయింది.

బెస్ట్ హీరోగా విక్రమ్…

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో త‌మిళంలో సిద్ధార్థ్ చిత్త (తెలుగులో చిన్నా) హ‌య్యెస్ట్ అవార్డుల‌ను అందుకున్న‌ది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్ట‌ర్‌తో పాటు మ‌రికొన్ని విభాగాల్లో చిత్త‌కు అవార్డులు వ‌చ్చాయి. బెస్ట్ హీరోగా పొన్నియ‌స్ సెల్వ‌న్ విక్ర‌మ్‌కు ఫిలింఫేర్ అవార్డు ద‌క్కింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 వేడుక‌లో ద‌క్షిణాదికి చెందిన హీరోహీరోయిన్లు, టెక్నీషియ‌న్లు పాల్గొన్నారు. ఈ వేడుక‌కు సందీప్‌కిష‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా తో పాటు వింధ్య హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024